Auto rally
-
కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు వైఎస్ జగన్
రాయచోటి: కార్మికుల కష్టం తెలిసిన ఏకైక నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన అని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆటోకు లైఫ్ ట్యాక్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 10వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ, అదే సమయంలో ఆటో కార్మికుల కోసం ఏడాదికి 10 వేల రూపాయలను అందజేస్తామని వైస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనకు మద్దతుగా మంగళవారం రాయచోటిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ఆటో కార్మికులకు వరంలాంటిదన్నారు. కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారిపై అదనపు భారం పడేలా లైఫ్ ట్యాక్స్‌లు వేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికులకు ఆటో నగర్, ప్రత్యేక హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.ఆటో యూనియన్ నాయకులు రామచంద్ర, విక్కీ, మహేష్, చాన్‌బాషా, రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు పల్లపు రాజారమేష్, ఎంపీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ జాఫర్, మైనార్టీ నాయకులు కొలిమి చాన్‌బాషా, లయన్ అన్వర్, ఫయాజ్ అహ్మద్, పార్టీ యువనాయకులు కిషోర్, హనుమంత్‌నాయక్, సురేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. యూనిఫాం పంపిణీ... ర్యాలీలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా యూనిఫాంను అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్ ఆర్థిక సాయంతో 60 మందికి అందజేశారు. జగనన్న పైనే మా ఆశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆటో కార్మికుల కష్టాలు తీరుతాయన్న ఆశ ఉంది. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తానని చేసిన ప్రకటనను అభినందిస్తున్నాం. జగన్మోహన్రెడ్డి రాకతోనే మా బాధలు తీరుతాయన్న ఆశాభావం ఆటో కార్మికులందరిలో ఉంది. ధన, ఆటో యూనియన్ నాయకుడు -
బాబు తీరుపై కామ్రేడ్ల కన్నెర్ర
రాజంపేట : జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపుతున్న వివక్షను ఎండగడుతూ రాజంపేటలో కామ్రేడ్లు మంగళవారం ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాపై చూపుతున్న పక్షపాత ధోరణిని మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముక్తకంఠంతో హెచ్చరించారు. జిల్లా సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ, ఆటో కార్మిక సంఘం, ఏఐఎస్ఎఫ్, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడారు. జిల్లాలో నిరుద్యోగుల భవిష్యత్ కోసం సెయిల్ ఆధ్వర్యంలో తక్షణం ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రచందనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ కేంద్రంతో పాటు ఉపాధి ఆధారిత పరిశ్రమను రాజంపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు, డ్వాక్రా సంఘాల రుణాలను తక్షణం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి మహేశ్, ఏఐటీఎస్ సీనియర్ నాయకుడు రాయుడు, మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి సులోచనమ్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడు శివరామకృష్ణ దేవరా, జిల్లా సహాయ కార్యదర్శి సురేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్, ఆటో వర్కర్స్ యూనియర్ అధ్యక్షుడు బలిజిపల్లె శ్రీనివాసులు మాట్లాడారు. -
పశువులను తరలించినట్టు..!
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : పశువులను ఒకచోట నుంచి మరోచోటికి తరలించినట్టు.. 38 మంది విద్యార్థులను ఆటోట్రాలీలో ఎక్కించి పంపించారు. పదిహేను మంది నిల్చునేందుకు వీలున్న ట్రాలీలో అంతకురెట్టింపు సంఖ్యలో చిన్నారులను కుక్కారు. విద్యార్థులను అందులో ఎక్కించి ఉపాధ్యాయులు తప్పిదం చేస్తే.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వారిని ప్రమాదంలోకి నెట్టింది. ఈ సంఘటన కోహెడ మండలం నాగసముద్రాల గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థులను స్కాలర్‌షిప్‌ల కోసం బ్యాంకు ఖాతా తీసేందుకు టాటా ఏస్ ఆటోట్రాలీలో ఎక్కించి ఉపాధ్యాయులు కోహెడకు పంపించారు. మార్గంమధ్యలో నాగసముద్రాల క్రాసింగ్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయిన ఆటోట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో మొత్తం 21 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఆరుగురు విద్యార్థుల చేతులు, కాళ్లు విరిగిపోగా, ఏడుగురు విద్యార్థుల తలలకు, మరో విద్యార్థినికి కన్ను, వెన్నుపూసకు తీవ్రగాయాలయ్యాయి. శివరాత్రి చంద్రశేఖర్ తలకు, కన్నుపై, సుదగోని మణికంఠ కన్ను, వెన్నుపూసకు తీవ్రగాయాలు కాగా, తాటిపాముల అశ్విని, కె.రాజు, లింగాల మమత, లింగాల ప్రదీప్, కుంచం శేఖర్, దేవిశెట్టి ఆనిల్కు చేతులు, కాళ్లు విరిగాయి. అభినాష్, మానస, వసంత, శిరీష, కుంచం మైనిక, జ్యోత్స్న, బొమ్మకంటి స్వప్న, మానస తల, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. తొలుత 17మందిని హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి, నలుగురిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. హుస్నాబాద్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స చేసిన అనంతరం ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మిగతా 14మందిని కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో కొందరిని మెరుగైన చికిత్స కోసం పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. శివరాత్రి చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించగా ప్రమాదం జరిగిందని చెబుతున్నా అతివేగం వల్లే అనర్థం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. డబుల్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకపోవడం, రోడ్డు దిగుడుగా ఉన్నప్పటికీ డ్రైవర్ వేగంగా వెళ్లి వాహనాన్ని న్యూట్రల్ చేయడంతో అదుపుతప్పినట్లు విద్యార్థులు చెబుతున్నారు. సంఘటనకు దగ్గరలోనే కల్వర్టు ఉండగా.. అక్కడ ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం సంభవించేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సురేష్, పీఈటీ హన్మంతు, డ్రైవర్ తిరుపతిలపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ తెలిపారు. -
వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ
-
విశాఖలో ఆటో ర్యాలీ