కడప : అందరికీ సమన్యాయం చేయాలంటూ ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. బీపీ, షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు పెద్దఎత్తున ప్రజలు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా డ్రామాలాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.
కాగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి దీక్షలకు ఈసీ గంగిరెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి జమ్మలమడుగులో వెంకటేశ్వర దేవాలయంలో 101 టెంకాయలు కొట్టారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, జేఏసీ నేతలు, ఉపాధ్యాయాలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ డ్రామాలాడుతోంది: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
Published Sat, Aug 17 2013 2:03 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement