ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్‌ జగన్‌ | Andhrula hopeful YS Jagan | Sakshi
Sakshi News home page

ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్‌ జగన్‌

Published Mon, Dec 12 2016 11:38 PM | Last Updated on Wed, Apr 4 2018 9:31 PM

ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్‌ జగన్‌ - Sakshi

ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్‌ జగన్‌

 –   ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి :  ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం లండన్‌ నగరంలోని హౌన్‌ స్లోవెస్ట్‌లో గల కోహినూర్‌ బాన్‌క్వెట్టింగ్‌ హాల్‌లో యునైటైడ్‌ కింగ్‌ డమ్‌ అండ్‌ యూరప్‌  వైఎస్‌ఆర్‌సీపీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ, రాజన్న రాజ్యం తీసుకురావడానికి నిత్యం పరితపిస్తూ ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతున్నా లెక్కచేయకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీలు ఇచ్చి పబ్బం గడుపుకుని, హామీలు నెరవేర్చకపోవడంపైన సుదీర్ఘంగా ఆయన వివరించారు. కార్యక్రమంలో వందల మంది ప్రవాసభారతీయుల కుటుంబ సభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగవైభవంగా నిర్వహించారు.  కార్యక్రమంలో లండన్‌లోని స్థానిక కౌన్సిల్‌ మేయర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకినాడ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ సునీల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement