రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం | mla srikanth reddy fire on ap cm chandra babunaidu | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం

Published Sun, May 15 2016 3:08 AM | Last Updated on Tue, May 29 2018 11:50 AM

రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం - Sakshi

రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం

ఒర్లాండ్‌లో ప్రవాసాంధ్రులతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు. సీఎం అవినీతికి పాల్పడిన అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు- అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ ఎన్నారై విభాగం అమెరికాలో శుక్రవారం ఆవిష్కరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండ్ నగరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

రాజధాని పేరుతో విలువైన భూములను సీఎం చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే విదేశీ పర్యటనల పేరుతో రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎన్నారై ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ సాధించడంలోనూ సీఎంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎన్నారై పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో అమెరికా దక్షిణ ఎన్నారై విభాగం పార్టీ ఇన్‌చార్జి నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement