బయటపడుతున్న తమ్ముళ్ల బాగోతాలు
పచ్చమీడియా అడ్డుపెట్టుకుని నీతులు
తప్పుడు పనులు బయటపడగానే మూతపడే నోళ్లు
ఎందెందు వెతికినా.. వాడు అందందే గలడు అన్నట్టు ఏ నేరం చూసినా.. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో టిడిపి నేతలే బయటకు వస్తున్నారు. బ్యాంకు కేసుల నుంచి డ్రగ్స్ దాకా, ఓటుకు కోట్లు నుంచి పేకాట శిబిరాల దాకా టిడిపి క్రైం లిస్టు పెరిగిపోతోంది.
గంట మోగింది.
టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు.
Comments
Please login to add a commentAdd a comment