ganta
-
Ganta : గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
ఎందెందు వెతికినా.. వాడు అందందే గలడు అన్నట్టు ఏ నేరం చూసినా.. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో టిడిపి నేతలే బయటకు వస్తున్నారు. బ్యాంకు కేసుల నుంచి డ్రగ్స్ దాకా, ఓటుకు కోట్లు నుంచి పేకాట శిబిరాల దాకా టిడిపి క్రైం లిస్టు పెరిగిపోతోంది. గంట మోగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు. -
‘ఆ అర్హత మంత్రి గంటాకు లేదు’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని విమర్శించే అర్హత మంత్రి గంటా శ్రీనివాసరావుకు లేదని కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, నాయకుడు నల్లా విష్ణు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యమం సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడకు ఇచ్చిన గడువు ఆగస్టు నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో, ముఖ్యమం త్రికి లేఖ రాసినట్టు వివరించారు. ముద్రగడపై గంటా వ్యంగంగా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్రీడల్లో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటే, పద్మనాభం కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముద్రగడ రాజకీయ నిరుద్యో గి అని గంటా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో మంత్రి పదవికి, డ్రెయినేజీ బోర్డు చైర్మన్ పదవికి ముద్రగడ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో గంటా శ్రీనివాసరావుపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికైనా స్పందిం చాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆకుల రామకృష్ణ, అల్లూరి శేషునారాయణ, మానే దొరబాబు పాల్గొన్నారు. -
వియ్యంకులైన రాష్ట్ర మంత్రులు
-
పర్యాటకుల స్వర్గధామం వైజాగ్
సాక్షి, విశాఖపట్నం : పర్యాటకుల స్వర్గధామంగా వైజాగ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆర్కేబీచ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న ప్రసంగిస్తూ పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలోని లంబసింగి, అల్లూరి సీతారామరాజు సమాధి ఉన్న కేడీ పేట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నకాలంలో మంజూరైన ప్రాజెక్టుల్లో ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నా రు. వాటన్నిం టినీ పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరారు. మంత్రి గంటా మాట్లాడు తూ బీచ్ కారిడా ర్ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సముద్రంలో ఒకటీ రెండు రోజుల పాటు క్రూయిజ్‌ల్లో విహారం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టు చైర్మన్‌తో చర్చించినట్లు వెల్లడించారు. పర్యాటకంగా విశాఖ గురించి దేశమంతా తెలి సేలా విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను కోరారు. సినిమా పరిశ్రమకు ఇప్పటికే విశాఖలో భూమి మం జూరు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు, కిడారి సర్వేశ్వరరావు, పీలా గోవింద్, వంగలపూడి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా ఇంచార్జ్ వీసీ ఎంవీ శేషగిరిబాబు, పర్యాటకశాఖ విశాఖ డివిజన్ జనరల్ మేనేజర్ భీంశంకరరావు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘సాక్షి’కి బహుమతులు పర్యాటక రంగానికి అద్దంపట్టేలా ఫొటోలు తీసిన సాక్షి ఫొటో జర్నలిస్టులు పీఎన్ మూర్తి, మహమ్మద్ నవాజ్‌లకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. ప్రజాశక్తి ఫొటో జర్నలిస్టు కె.రాజేశ్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. వారికి మంత్రులు అయ్యన్న, గంటా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. రఫీ (లీడర్), విజయ్ (ఆంధ్రజ్యోతి), శరత్‌కుమార్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), భాస్కరరావులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
సెప్టెంబర్ 5న డీఎస్సీ ప్రకటన: మంత్రి గంటా
సాక్షి, విశాఖపట్నం: ‘‘ఉపాధ్యాయ దినోత్సవం అయిన సెప్టెంబర్ 5న డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తాం. దీనికి సంబంధించి కసరత్తు జరుపుతున్నాం. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలపై అయోమయం ఉన్నందున త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి తేదీలను ఖరారుచేస్తాం అని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా వివరించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఏపీలోని 15 యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. -
టి బిల్లు చర్చ గడువు ఇంకా పెంచాల్సిందే: గంటా
-
బొత్సపై మంత్రి గంటా సెటైర్లు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య సెటైర్లు యుద్ధం జోరుగా సాగుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో సెటైర్ వేశారు. విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి సహా బొత్స సత్యనారాయణ సహా మంత్రలందరకూ అధిష్టానానికి రాసిన లేఖపై సంతకాలు పెట్టామన్నారు. ఆ ప్రకారం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బొత్స కూడా వ్యతిరేకించినట్లే కదా అని గంటా ప్రశ్నించారు. వ్యక్తులు ఇతర పార్టీల వైపు చూడటం కాదని... పార్టీలే ఇతర పార్టీలపై కండువాలు వేస్తున్న సమయమిది అని గంటా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కావొచ్చని అన్నారు. తాము మాత్రం ఎప్పటికీ సమైక్యాన్నే కోరుకుంటున్నామని గంటా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి తాగునీటి ప్రాజెక్టుల విషయంలో చిత్తూరుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. -
నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తాం:గంటా
-
రాష్ట్రాన్ని విభజిస్తే రాజీమా చేస్తాం: గంటా