
సెప్టెంబర్ 5న డీఎస్సీ ప్రకటన: మంత్రి గంటా
సాక్షి, విశాఖపట్నం: ‘‘ఉపాధ్యాయ దినోత్సవం అయిన సెప్టెంబర్ 5న డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తాం. దీనికి సంబంధించి కసరత్తు జరుపుతున్నాం. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలపై అయోమయం ఉన్నందున త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి తేదీలను ఖరారుచేస్తాం అని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా వివరించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఏపీలోని 15 యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.