
బొత్సపై మంత్రి గంటా సెటైర్లు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య సెటైర్లు యుద్ధం జోరుగా సాగుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో సెటైర్ వేశారు. విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి సహా బొత్స సత్యనారాయణ సహా మంత్రలందరకూ అధిష్టానానికి రాసిన లేఖపై సంతకాలు పెట్టామన్నారు. ఆ ప్రకారం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బొత్స కూడా వ్యతిరేకించినట్లే కదా అని గంటా ప్రశ్నించారు.
వ్యక్తులు ఇతర పార్టీల వైపు చూడటం కాదని... పార్టీలే ఇతర పార్టీలపై కండువాలు వేస్తున్న సమయమిది అని గంటా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కావొచ్చని అన్నారు. తాము మాత్రం ఎప్పటికీ సమైక్యాన్నే కోరుకుంటున్నామని గంటా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి తాగునీటి ప్రాజెక్టుల విషయంలో చిత్తూరుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు.