
సాక్షి వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో ఫ్లైయాష్ కోసం కొట్లాట కొనసాగుతోంది. తాజాగా ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు వారిలో వారే దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డినట్టు సమాచారం. దీంతో, ఫ్లైయాష్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఒకరినొకరు తన్నుకున్నారు. తాజాగా ఉచితంగా వచ్చే ఫ్లైయాష్‌ను అమ్ముకునేందుకు ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్యే రగడ చోటుచేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్‌రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లైయాష్ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడులకు తెగబడటంతో పలువురు గాయపడినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులను ఫ్లైయాష్ వద్దకు రానివ్వకుండా ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో రెండు జిల్లాల నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. అనంతరం, పలు పరిణామాల మధ్య జేసీ సైలెంట్ అయ్యారు. కానీ, తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఫ్లైయాష్ విషయంలో మరోసారి దాడులకు దిగింది.

Comments
Please login to add a commentAdd a comment