fly ash bricks
-
ఫ్లైయాష్ దందా.. ఆదినారాయణరెడ్డి వర్గీయులు కొట్లాట
సాక్షి వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో ఫ్లైయాష్ కోసం కొట్లాట కొనసాగుతోంది. తాజాగా ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు వారిలో వారే దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డినట్టు సమాచారం. దీంతో, ఫ్లైయాష్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఒకరినొకరు తన్నుకున్నారు. తాజాగా ఉచితంగా వచ్చే ఫ్లైయాష్‌ను అమ్ముకునేందుకు ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్యే రగడ చోటుచేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్‌రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లైయాష్ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడులకు తెగబడటంతో పలువురు గాయపడినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులను ఫ్లైయాష్ వద్దకు రానివ్వకుండా ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో రెండు జిల్లాల నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. అనంతరం, పలు పరిణామాల మధ్య జేసీ సైలెంట్ అయ్యారు. కానీ, తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఫ్లైయాష్ విషయంలో మరోసారి దాడులకు దిగింది. -
ఇంటిపై ఇటుక భారం
దేశవ్యాప్తంగా గతేడాది నిర్మించిన పలు థర్మల్ ప్రాజెక్టుల యాష్ పాండ్లకు నిర్వహించిన వేలంలో రామగుండం ఎన్టీపీసీకి పక్కనే ఉన్న కుందనపల్లి యాష్‌కు అత్యధికంగా టన్ను బూడిదకు రూ.402 పలికింది. అందుకే ఇక్కడ గతంలో ఇటుకబట్టీ కేంద్రాల్లో రూ.5.50 చొప్పున లభించే ఇటుక అమాంతం రూ.7.50కు చేరింది. ఇది రవాణాను బట్టి మారుతుంటుంది. అదే ఢిల్లీలో టన్నుకు రూ.160, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో టన్నుకు రూ.200లోపే పలికింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంటిపై ఫ్లై యాష్ ఇటుక భారం పడింది. 6 నెలల్లో ఈ ఇటుక రేటు ఏకంగా రూ. 2 పెరిగింది. ఎన్టీపీసీ బూడిదకు టెండర్లు వేయడంతో రేట్లు రెండింతలయ్యాయని, దీంతో ఇటుకల రేట్లు పెరిగాయని బట్టీల వ్యాపారులు చెబుతున్నారు. 2021 సెపె్టంబర్‌కు ముందు టన్ను బూడిద ధర రూ. 23 ఉండగా ఇప్పుడు అది అమాంతం రూ. 400కు పెరిగిందని అంటున్నారు. బూడిద రేట్ల ప్రభావం ఇటుక ధరలపై పడటంతో ఇళ్ల నిర్మాణ భారం రూ. 30 వేల నుంచి రూ. లక్షల్లో పెరిగింది. ఎన్టీపీసీ బూడిదే బంగారమాయేనా! రాష్ట్ర నిర్మాణ రంగానికి కావాల్సిన 50% ఇటుకలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల నుంచే ఉత్పత్తి అవుతాయి. జిల్లాలో ఉత్పత్తి అయ్యే 50% ఇటుకల్లోనూ 60 శాతం పెద్దపల్లి జిల్లా నుంచే వస్తుంటాయి. గోదావరి తీరం, ఎన్టీపీసీ బూడిద, మట్టి నిక్షేపాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. అయితే మొన్నటిదాకా ఎవరికీ పట్టని ఎన్టీపీసీ బూడిద ఇపుడు బంగారమైంది. 2021 సెపె్టంబర్ ముందు వరకు ఎన్టీపీసీ బూడిద ధర 30 టన్నుల లారీకి రూ.700గా ఉండేది. అంటే టన్నుకు రూ.23.30, క్వింటాలుకు రూ.2.3 గాను. కిలో రూ.0.023 (పైసలు)గా ఉండేది. కానీ.. టెండర్లు వేశాక అదే 30 టన్నుల లారీకి రూ.12,000 వరకు వసూలు చేస్తున్నారు. బూడిద ప్రియమవడంతో దాని ఆధారంగా తయారయ్యే ఇటుకల ధరలూ అమాంతం పెరిగాయి. దీంతో రాష్ట్రంలో భవనాల నిర్మాణ వ్యయం కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్షల్లో పెరిగింది. సాక్షి కథనాలపై సీఎం కార్యాలయం ఆరా! ఎన్టీపీసీ బూడిద వ్యవహారంలో ‘సాక్షి’కొంతకాలంగా ప్రచురిస్తున్న వరుస కథనాలపై సీఎం కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది. కొందరు నేతల సాయంతో రోజూ రూ.లక్షల విలువైన బూడిదను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవల ప్రచురితమైన కథనాలపై స్థానిక అధికారులతో నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారి కూడా ముందుకు రాకపోవడం స్థానికంగా ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అద్దం పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విక్రయాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2021 సెప్టెంబర్ ముందు బూడిద ధరలు 30 టన్నుల బూడిద లారీ రూ.700 టన్ను బూడిద రూ.23.30 కిలో బూడిద రూ.0.023 2021సెప్టెంబర్ తరువాత ధరలు 30 టన్నుల బూడిద లారీ ధర రూ.12,000 టన్ను బూడిద ధర రూ.400 కిలో బూడిద ధర రూ.0.4 -
ఇటుకలు దొరకడం లేదు...!
రాజధానిలో ఫ్లైయాష్ ఇటుకలనే వాడాలి డిమాండ్‌కు సరిపడా లేని ఫ్లైయాష్ సరఫరా రోజుకు 2,000 టన్నుల డిమాండ్ సరఫరా 600 టన్నులకే పరిమితం సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి ఇటుకల కొరత సమస్యగా మారింది. రాజధాని చుట్టుపక్కల నిర్మాణ రంగ పనులకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉండటం లేదు. తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పరిపాలన మొదలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు. అయితే వీటన్నింటికీ కావాల్సిన ఇటుకల సరఫరా కష్టంగా కనిపిస్తోంది. చట్ట ప్రకారం థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్న 100 కి.మీ పరిధిలో నిర్మాణ రంగంలో కేవలం ఫ్లైయాష్ ఇటుకలనే వాడాల్సి ఉంది. మట్టితో చేసిన ఇటుకలను వాడటానికి వీలు లేదు. రాజధాని ప్రాంతం విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(వీటీపీఎస్)కు కేవలం 10 కి.మీల దూరంలో ఉంది. దీంతో ఇక్కడ ఫ్లైయాష్ ఇటుకలనే వాడాల్సి ఉంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఫ్లైయాష్ ఇటుకల సరఫరా కావడం లేదు. ఫ్లైయాష్ సరఫరా లేదు... ఇటుకలు తయారు చేయడానికి తగినంత ఫ్లైయాష్‌ను విద్యుత్ కేంద్రాలు సరఫరా చేయడం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఫ్లైయాష్ బ్రిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 300 పైగా ఫ్లైయాష్ బ్రిక్స్ యూనిట్లున్నాయని, వీటికి రోజుకు 2,000 టన్నుల ఫ్లైయాష్ అవసరమైతే కేవలం 500 నుంచి 600 టన్నులు మాత్రమే సరఫరా ఉంటోందని ఏపీ ఫ్లైయాష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె.వి.సుబ్బారావు వివరించారు. విజయవాడ వీటీపీఎస్ నుంచి రోజుకు సుమారు 8వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోందని, ఇందులో సిమెంట్ ఫ్యాక్టరీలకు 3వేల టన్నులు పోగా మిగిలిన ఫ్లైయాష్‌ను బ్రిక్స్ యూనిట్లకు ఇవ్వడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. థర్మల్‌పవర్ స్టేషన్లకు ఫ్లైయాష్‌ను వదిలించుకోవడం అతిపెద్ద సమస్య. అందుకే ఫ్లైయాష్‌ను బ్రిక్ యూనిట్లకు ఉచితంగా సరఫరా చేయడమే కాకుండా, తీసుకెళ్లినందుకు రవాణా ఖర్చులూ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చాలా థర్మల్ యూనిట్లు ఉచితంగా కొంత ఇచ్చినట్లు రికార్డుల్లో చూపి, మిగిలిన మొత్తాన్ని ఫ్లైయాష్ పాండ్స్‌లోకి తరలిస్తున్నాయి. ఇందుకోసం పెద్దఎత్తున మంచి నీటిని వృథా చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా ఫ్లైయాష్ యూనిట్లున్నాయి. వీటికి సగటున రోజుకు 20వేల టన్నుల ఫ్లైయాష్ అవసరమవుతుంది. కానీ ఈ స్థాయిలో ఫ్లైయాష్ సరఫరా లేదని బ్రిక్స్ యాజమాన్యం వాపోతోంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రత్యామ్నాయంగా మట్టి ఇటుకలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందువల్ల సారవంతమైన మట్టి వృథా కావడమే కాకుండా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించాలని ప్లైయాష్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. -
ఇటుకలు దొరకడం లేదు...!