ఫిజియోథెరపీ నాలుగో ఏడాది చదువుతున్న కీర్తి
థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్‌లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనస్తాపం
షాద్‌నగర్ రూరల్: పరీక్షలో ఫెయిల్ కావ డంతో మనస్తాపం చెందిన ఫిజియో థెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన గురువారం రాత్రి షాద్‌నగర్ రైతు కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బుచ్చి బాబు, అమృత దంపతుల పెద్ద కూతురు కీర్తి (24) హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కళాశాలలో ఫిజియోథెరపీ నాలు గో ఏడాది చదువుతోంది. ఇటీవల థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఓ సబ్జెక్టులో ఫెయిలైన కీర్తి తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కీర్తి తల్లి, ఆర్‌ఎంపీ వైద్యుడైన తండ్రి బుచ్చిబాబు ఇద్దరూ వేర్వేరు పనులపై గురువారం సాయంత్రం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కీర్తి సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తండ్రి బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రాంచందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment