ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక... ఆమరణ నిరాహార దీక్షలు | ysrcp leaders indefinite hunger strike continues on 6th day | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక... ఆమరణ నిరాహార దీక్షలు

Published Sun, Aug 18 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

ysrcp leaders indefinite hunger strike continues on 6th day

సాక్షి, కడప: వైఎస్‌ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు శనివారంతో ఆరోరోజు పూర్తయ్యాయి. రాత్రి 8గంటలకు వీరిని వైద్యులు పరీక్షించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయినా దీక్షలు కొనసాగించడానికే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి నిర్ణయించారు. పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల వారు తరలివచ్చి  వీరికి సంఘీభావం  ప్రకటిస్తున్నారు.

 

మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈసీ గంగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి దీక్షలు శనివారంతో మూడవ రోజు పూర్తి చేసుకుని ఆదివారంతో నాలుగురోజుకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement