P. ravindranath reddy
-
సాగునీటికి సమరం.. వైఎస్సార్సీపీ నేతల దర్నా
కడప కార్పొరేషన్ : కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డిఆధ్వర్యంలో కదం తొక్కారు. పాపాఘ్నినదికి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ పోరుబాట పట్టారు. సోమవారం కొత్త కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షల కోట్లు దిగమింగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లక తప్పదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. పాపాఘ్నినదికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆయన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ‘కరువుపై పోరు’పేరుతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కరువు, బాబు కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు రక్కసి కరాళనృత్యం చేస్తుందన్నారు. ఒక్క శ్రీకాకుళం తప్ప రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతోందన్నారు. శ్రీకాకుళంలో మాత్రమే వరదలు వచ్చి అతివృష్టి సంభవించిందన్నారు. ప్రస్తుత కరువు గంజికరువు, ధాతు కరువును మించిపోయిందని రైతులు చెప్పుకుంటున్నారని అన్నారు. లక్షల కోట్లు దిగమింగడానికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు ముందు రాష్ట్రానికి రూ.60వేల కోట్ల అప్పులుంటే, ప్రస్తుతం అదనంగా రెండుల లక్షల కోట్లు ఉన్నాయన్నారు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ఉద్యమించి సాధించుకున్నామని, ఇప్పుడు పాపాఘ్ని నదికి కూడా నీటిని విడుదల చేసే వరకు పోరాటం ఆగదన్నారు. మైలవరం దక్షిణ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రతిరైతుకు ఏటా రూ.12,500 పెట్టుబడి కోసం ఇవ్వడం జరుగుతుందని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కమలాపురం నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మారుస్తామని, ప్రతి రైతు ఏటా రూ.4 లక్షలు సంపాదించేలా చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, అఫ్జల్ఖాన్, టీఎస్సార్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, రైతు నాయకులు రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, పత్తి రాజేశ్వరి, బాలమల్లారెడ్డి, ఉత్తమారెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వేణుగోపాల్ నాయక్, ఖాజా, దేవిరెడ్డి ఆదిత్య, టీపీ వెంకటసుబ్బమ్మ, శ్రీలక్ష్మి, రత్నకుమారి, సీహెచ్ వినోద్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరువల్లే బీమా సొమ్ము రైతులకు రాలేదు: వైఎస్ అవినాష్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే 2012–13లో శనగ పం టకు సంబంధించిన రూ. 120 కోట్ల పంటల బీమా రైతులకు రాకుండా పోయిందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నా రు. రాష్ట్ర వాటా చెల్లిస్తే తాము మిగతా మొత్తాన్ని ఇస్తామని కేంద్రం లేఖ రాసి రెండేళ్లవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖకు సమాధానం ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఈ ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని,. ఇతర రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చినా ఆ నీటిని గండికోటకు, బ్రహ్మంసాగర్‌కు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మొగమేరు వంక ద్వారా పాపాఘ్ని నదికి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి కమలాపురం నియోజకవర్గంలోని వీఎన్ పల్లి, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం మండలలాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్నారు. అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్నిసర్వనాశనం చేశారు: సురేష్‌బాబు రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు ధ్వజమెత్తారు. రాయలసీమకు కృష్ణాజలాలు తేవాలని వైఎస్ఆర్ పరితపించారని, ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీతో కూడా పోరాడి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. వెలిగల్లు, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి వెలిగల్లులో 5 టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌లో 11 టీఎంసీలు నిల్వ ఉంచారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గండికోట ముంపువాసులకు పరిహారం ఇవ్వలేదని, శ్రీశైలం రిజర్వాయర్‌కు 210టీఎంసీల వరద వచ్చినా జిల్లాలోని ప్రాజెక్టులకు చుక్క నీరివ్వలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రస్థానమే అధర్మంతో మొదలైంది: అంజద్‌బాషా సీఎం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే అధర్మంతో మొదలైందని, ధర్మం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆయనకు ధర్మపోరాట దీక్షలు చేసే అర్హత లేదని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా అన్నారు. బాబు గత తొమ్మిదేళ్లపాలనలో ఏడేళ్లు కరువులు వచ్చాయని, ఇప్పుడు నాలుగేళ్లు కూడా రైతులు కరువుతో అల్లాడుతున్నారన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో వ్యవసాయమే ఉండదన్నారు. సీఎం, అతని బినామీలు రాష్ట్రాన్ని లూటీ చేశారు: దుగ్గాయపల్లె ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని బినామీలైన సీఎం రమేష్, సుజనా చౌదరిలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టులకు శిలాఫ లకాలు వేశారే తప్ప ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. పాపాఘ్నికి నీటిని విడుదల చేయాలని రెండు నెలలుగా వినతిపత్రాలు ఇస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అతివృష్టి, అనా వృష్టితో రైతులు అల్లాడుతుంటే సీఎం బోటు రేసులు, విమాన విన్యాసాల కోసం రూ.400కోట్లు ఖర్చుచేయడం దారుణమన్నారు. 120 డొల్ల కంపెనీలు పెట్టి రూ.5700కోట్లు రుణం తీసుకొని బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి విషయంలో సీఎం ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబులాంటి వ్యక్తి సీఎంగా అవసరం లేదు: పి. సుబ్బారెడ్డి చంద్రబాబు రాయలసీమ వాసి అయినా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ 90 శాతం ప్రాజెక్టులను పూర్తి చేస్తే అందులో సీఎం జలహారతులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. నదుల అనుసంధానం పేరుతో వేలకోట్లకు టెండర్లు పిలిచి కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదినారాయణరెడ్డి, బుద్దావెంకన్న, చింతమనేని, దేవినేని ఉమా లాంటివారిని చుట్టూ పెట్టుకొని సీఎం అరాచకాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సాగు నీరిచ్చి రైతులను ఆదుకోండి పైడిపాళెం నుంచి కృష్ణాజలాలను పాపాఘ్ని నదికి విడుదల చేయాలని, సర్వరాయ సాగర్ నుంచి పాగేరు వంకకు కూడా నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు, అంజద్‌బాషా, మల్లికార్జునరెడ్డి కోరారు. ధర్నా అనంతరం వారు జేసీ–2 శివారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సాగునీరు విడుదల చేసి వీఎన్‌పల్లి, పెండ్లిమర్రి, కమలాపురం, వల్లూరు మండలాల రైతులను ఆదుకోవాలన్నారు. సర్వరాయసాగర్ నుంచి పాగేరు వంకకు నీటిని విడుదల చేస్తే వీఎన్‌పల్లె, యర్రగుంట్ల, కమాపురం మండలాల్లోని అనేక గ్రామాలకు తాగునీటి కొరత తీరుతుందన్నారు. మైలవరం దక్షిణ కాలువ నుంచి వస్తున్న 100 క్యూసెక్కుల నీటిని 300 క్యూసెక్కులకు పెంచాలన్నారు. కరువు మండలాల్లో సహాయ చర్యలు చేపట్టాలని, 2012, 2014, 2015,2016 సంవత్సరాల్లో రావాల్సిన ఇన్‌స్రూ?న్స్, పెట్టుబడి రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు అఫ్జల్ఖాన్, పులి సునీల్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ కుటుంబం’లో 70 లక్షల కుటుంబాలు
తిరుపతి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలు వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వం తీసుకున్నాయని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆదివారం ఆయన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్‌పై అభిమానం, జననేత జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా గత శుక్రవారం వరకు 70 లక్షల కుటుంబాలు సభ్యత్వం తీసుకున్నాయని, త్వరలోనే కోటి కుటుంబాలు వైఎస్సార్ కుటుంబంలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోందని, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు కాలేదని విమర్శించారు. లంచాలు, కమీషన్లు వచ్చే పనులనే బడ్జెట్లో పెడుతూ రాష్ట్రంలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని బాబు, లోకేశ్‌లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు తరిమి కొడతారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవీంద్రనాథ్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
రైతులను ఆదుకోవాలి
కడప కార్పొరేషన్/పెండ్లిమర్రి: రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సభ్యులు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి పెండ్లిమర్రి మండలంలోని చీమలపెంట, రేపల్లె, బాలయ్యగారి పల్లె, రామచంద్రాపురం గ్రామాలలో దెబ్బతిన్న వేరుశనగ, పత్తి, మినుము పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 22 కేంద్ర సహకారం బ్యాంకులకు గాను 18 బ్యాంకులు దివాళా తీశాయన్నారు. అక్టోబర్ నెలలో పచ్చగా ఉండాల్సిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్రమంతటా కరువు తాండవిస్తోందన్నారు. 55 శాతం సాగు అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా 20 శాతమే జరిగిందన్నారు. పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ఎన్యుమరేషన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆమరణ దీక్ష చేశారని, అప్పుడు ఆయన డిమాండ్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ. 5వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చెప్పి, బడ్జెట్లో దాని ప్రస్తావనే తేలేదన్నారు. రుణాలు రెన్యూవల్ కాకపోవడం వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం జమ కాక రైతులు నష్టపోయారన్నారు. వ ర్షాలు రాక, పంటలు పండక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ఇన్స్యూరెన్ లేక, నష్టపరిహారం అందక రైతులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రైతులు నష్టపోయిన పెట్టుబడిని ప్రభుత్వమే ఇవ్వాలి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వర్షాభావం వల్ల రైతుల నష్టపోయిన పెట్టుబడిని ప్రభుత్వమే చెల్లించాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉల్లికి ఎకరాకు రూ. 50వేలు, వేరుశనగ, మినుము, పెసర, పత్తి పంటలకు రూ. 25వేలు పెట్టుబడి నష్టం కింద ఇవ్వాలన్నారు. చంద్రబాబు మోసపూరిత విధానాల వల్లే రైతులు ఇన్సూరెన్స్ నష్టపోయారన్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులను కూడా డీఫాల్టర్స్‌గా చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని రైతులు భావించినట్టుగానే ఇప్పుడు జరుగుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతంలో తీవ్ర అనావృష్టి వల్ల, మరో ప్రాంతంలో అతివృష్టి వల్ల రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయ అధికారిణి నాగార్చన, ఉద్యానవన శాఖ హెచ్ఓ రేణుకా ప్రసాద్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి, జెడ్పీటీసీ పసల భాస్కర్, సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగేంద్రారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, నాగమల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలయ్య, నాయకులు రామ్మోహన్‌రెడ్డి, పుల్లారెడ్డి, అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. -
ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక... ఆమరణ నిరాహార దీక్షలు
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు శనివారంతో ఆరోరోజు పూర్తయ్యాయి. రాత్రి 8గంటలకు వీరిని వైద్యులు పరీక్షించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయినా దీక్షలు కొనసాగించడానికే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి నిర్ణయించారు. పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల వారు తరలివచ్చి వీరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈసీ గంగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి దీక్షలు శనివారంతో మూడవ రోజు పూర్తి చేసుకుని ఆదివారంతో నాలుగురోజుకు చేరాయి. -
క్షీణించిన ఆరోగ్యం.. ఐదోరోజు దాటిన శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ల ఆమరణ దీక్ష
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడి ్డలు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజులు పూర్తిచేసుకుని, శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక దీక్ష చేస్తున్న వీరిద్దరికీ సంఘీభావం తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. శుక్రవారం నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో నాలుగురాష్ట్రాలు కావాలని అక్కడి అసెంబ్లీ తీర్మానాన్ని చేసి, పార్లమెంట్‌కు పంపినా విభజించని కేంద్రం ఇక్కడ మాత్రం వద్దంటే ఎందుకు విడగొడ్తోందని ప్రశ్నించారు. తెలుగువారిని విభజించేందుకు కారణమేంటో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జననేత, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాను తగ్గించేందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని అందరికీ అర్ధమవుతోందని మేకపాటి పేర్కొన్నారు. అయితే జగన్ జనశక్తి రెండుప్రాంతాల్లోనూ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లో కలిపి తమకు 30-35 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారంతో రెండవరోజు పూర్తిచేసుకున్నాయి. వీరి దీక్షలకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.