క్షీణించిన ఆరోగ్యం.. ఐదోరోజు దాటిన శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ల ఆమరణ దీక్ష
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడి ్డలు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజులు పూర్తిచేసుకుని, శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక దీక్ష చేస్తున్న వీరిద్దరికీ సంఘీభావం తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. శుక్రవారం నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో నాలుగురాష్ట్రాలు కావాలని అక్కడి అసెంబ్లీ తీర్మానాన్ని చేసి, పార్లమెంట్‌కు పంపినా విభజించని కేంద్రం ఇక్కడ మాత్రం వద్దంటే ఎందుకు విడగొడ్తోందని ప్రశ్నించారు. తెలుగువారిని విభజించేందుకు కారణమేంటో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జననేత, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హవాను తగ్గించేందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని అందరికీ అర్ధమవుతోందని మేకపాటి పేర్కొన్నారు.
అయితే జగన్ జనశక్తి రెండుప్రాంతాల్లోనూ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లో కలిపి తమకు 30-35 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారంతో రెండవరోజు పూర్తిచేసుకున్నాయి. వీరి దీక్షలకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.