
యాదాద్రి భువనగిరి : ముగ్గురు బాలికలను పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ హాజీపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న30మందిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం (రెండోరోజు) ఆమరణదీక్ష కొనసాగించిన గ్రామస్తులు.. నిందితుడికి పడిన శిక్షలతో సమాజంలో నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టాలని భీష్మించుకొని కూర్చున్నారు. బాలికలు శ్రావణి, మనీషా, కల్పన ఆత్మలు శాంతించాలంటే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుంటుంబాకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనే నినాదాలతో మండల కేంద్రంలోని గుడిబావి చౌరస్తా మారుమ్రోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యగా అరెస్టు చేసినుట్ట వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment