
యాదాద్రి భువనగిరి: బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో బాలికల వరస హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. హాజీపూర్ గ్రామస్తులు బొమ్మలరామారం చౌరస్తాలో గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి సంఘీభావం తెలపడానికి టీఆర్‌ఎస్ నేతలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని గ్రామస్తులు, బాధితులు వారిని నిలదీశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఏ ప్రకటనా చేయలేకపోయిందని టీఆర్‌ఎస్ నాయకులు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఇప్పుడు కూడా కోడ్ అమలులోనే ఉందికదా అని గ్రామస్తులు ప్రశ్నించారు. ‘మీ సంఘీభావ యాత్రలతో పనిలేదు. స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలి’ అని వారు డిమాండ్ చేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా
Comments
Please login to add a commentAdd a comment