రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఆశయం అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ న్యాయం కోసం ఎప్పుడూ తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యంగా సమ న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సిఎం కావచ్చని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు విప్ జారీ చేశారని చెప్పారు. ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని అమర్నాథ్ రెడ్డి చెప్పారు. టిడిపి వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్ఆర్ సిపియే నని ఆయన తెలిపారు.
Published Tue, Sep 3 2013 3:49 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement