చంద్రబాబును అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే శ్రీకాంత్ | MLA Srikanth Reddy demads to arrest Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Sep 17 2013 7:13 PM | Updated on Mar 22 2024 11:13 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసులో దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే జగన్‌పై బాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడడం ఆయన ఎప్పుడో మరిచిపోయారన్నారు. ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దౌర్భాగ్యం అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement