రాయలసీమ విభజనకు తాము అంగీకరించం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ చెప్పారు. రాయలసీమకు ప్రత్యేక సంస్కృతి, చరిత్ర ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రాయలసీమను విభజించాలనుకోవడం సరికాదన్నారు. రాజకీయ అస్థిరతను సృష్టించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోందని విమర్శించారు. రాయల తెలంగాణ కావాలని ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రజాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలు పక్కనబెట్టి కాంగ్రెస్ ఆలోచించాలని అన్నారు. రాయలసీమను విభజిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనుకోవడానికి ఐపీఎస్ అధికారి ఇక్బాల్ రాజీనామానే నిదర్శనం అని పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణకు వ్యతిరేకమని ఎక్కడా చెప్పలేదన్నారు. రాజకీయ కోణంలో కాంగ్రెస్ విభజన కసరత్తు చేయడానికి నిరసనగానే రాజీనామాలు చేశామని చెప్పారు