లోకేష్ ఒక చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్ | Lokesh is an idiot : MLA Srikanth Reddy | Sakshi
Sakshi News home page

లోకేష్ చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్

Published Wed, Sep 11 2013 3:43 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

లోకేష్ ఒక చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్

లోకేష్ ఒక చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్‌ చవటబ్బాయని  వైఎస్ఆర్ సీఎల్పీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డికి  వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్‌ లీలలు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమకు బాగా తెలుసని చెప్పారు.

చంద్రబాబు గోబెల్స్ ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు. లేకుంటే లోకేష్‌ లీలలు బయటపెడతామని హెచ్చరించారు. సీమాంధ్రలో చంద్రబాబు చేసేది ఆత్మగౌరవ యాత్ర కాదని, వైఎస్ఆర్ సిపిపై విషప్రచారయాత్ర అన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేసే ఎన్టీఆర్‌ను దించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. 2009 ముందు వైఎస్ఆర్పై గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని,  వైఎస్‌కే పట్టం కట్టారని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement