ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి | Rayachoti MLA Srikanth Reddy begins Deeksha | Sakshi
Sakshi News home page

ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి

Published Mon, Aug 12 2013 11:26 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి - Sakshi

ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి

కడప : సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  కాంగ్రెస్‌ కుయుక్తులు, టీడీపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పోరాటం సాగించేందుకు వారు దీక్షకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే  శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

తెలుగుతల్లి కడుపుకోతకు గురయ్యే పరిస్థితి కల్పించినా, విభజన పేరుతో సీమకు అన్యాయం జరగబోతోందని తెలిసినా అధికార పార్టీ నేతలు నిమ్మకు  నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే  శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవండంతో ఆమరణదీక్ష చేపట్టారు.

విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగుతుందని, ఈ ప్రక్రియలో తమ ప్రాణాలు పోయినా లెక్క చేయమని శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement