కడప: తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ డ్రామా ఆడుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే సత్తా, దమ్ము ధైర్యం ఉన్నప్పుడు శిబిరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తరలిస్తామని, కోట్లాది రూపాయల నగదుతో పాటు, కాంట్రక్టు పనులు కల్పిస్తామని ప్రలోభాలు పెడుతున్నదన్నారు.
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి గెలుపు తథ్యమన్నారు. వివేకానంద రెడ్డికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా రాణించారన్నారు. అయన గెలుపును ఎవరూ అపలేరంటూ టీడీపీ శిబిరాలలో ఉన్న వారు సైతం వివేకానంద రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారన్నారు.