
ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయం
–ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి : రాయచోటి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ శివార్లలలోని పాలిటెక్నిక్ కళాశాల ఆదనపు భవనాల నిర్మాణపు పనులను, రాజీవ్ స్వగృహ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న మైనార్టీ బాలుర వసతి గృహాన్ని, ఓదివీడు మార్గంలో నిర్మితమవుతున్న ఉర్దూ బాలికల జూనియర్ కళాశాల, మైనార్టీ బాలుర ఐటీఐలు, హస్టళ్ల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ జనార్ధనరెడ్డి, డీఈ చంద్రశేఖర్‌రెడ్డిలతో భవన నిర్మాణ పనులపై చర్చించి పనులను నాణ్యతగా, రాబోయే విద్యాసంవత్సరంలోగా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో ఇండోర్ స్టేడియం, ఉర్దూ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ఉద్యాన, వ్యవసాయ కళాశాలల మంజూరుకు కృషి చేస్తున్నానన్నారు. లక్కిరెడ్డిపల్లె, రాయచోటిలలోని ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల భవన నిర్మాణాలను, రామాపురం, దేవపట్ల, లక్కిరెడ్డిపల్లెలోని గురుకుల పాఠశాలల అదనపు భవనాల నిర్మాణాలను త్వరితగితంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఏఈలు సుధాకర్‌బాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ ఫయాజుర్‌రహిమాన్, వైఎస్‌ఆర్‌సీపీ యువజనవిభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పీఎస్ రిజ్వాన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వడ్డె వెంకట్రామణారెడ్డి, రియాజుర్‌రహిమాన్, తదితరులు ఉన్నారు.