- ఎమ్మెల్యే అమరనాథరెడ్డి
పెద్దపంజాణి: రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన పెద్దపంజాణి మండలంలోని కంగానంబండ గ్రామంలో నూతనంగా ప్రారంభమైన విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి పేరుతో నెలకోమారు విదేశాలకు ప్రభుత్వ ఖర్చులతో వెళ్లి, సొంత వ్యాపారాల లెక్కలు చూసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కుమారుడికి కూడా ప్రభుత్వ అధికారులను వెంట బెట్టి అమెరికాకు పంపడం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు వద్ద ఉన్న ఓఎస్‌డీ అభీష్ట, కార్తికేయ మిశ్రాలను తన కుమారుడి వెంట ఒకే విమానంలో పంపడం, వారి ఖర్చుల కోసం ప్రభుత్వం 1326, 1336 జీవోలను మం జూరు చేయడం ఎంతవరకూ సమంజ సమన్నారు. ప్రభుత్వ సొమ్ము మం చినీళ్లలా తమ సొంత పనులకు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేసి గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తానని చెబుతున్న సీఎం, కాలువ పనులకు నిధులు ఎం దుకు మంజూరు చేయలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్ల ఒతి ్తడి పెరగడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన సీఎం సభలో రాము అనే రైతు ఆత్మహత్యకు యత్నించడమే ఇందుకు సాక్ష్యమ ని తెలిపారు.
రాజధాని పేరుతో మూ డు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కొవడమేమిటన్నారు. రాజ ధాని పేరుతో వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపిం చారు. కుప్పంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఎవరడిగారని, దీన్ని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటున్నారని విమర్శిం చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శ్రీరాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
అవినీతి రాజ్యమేలుతోంది
Published Fri, May 8 2015 4:30 AM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM
Advertisement
Advertisement