అసలు పేర్లు చెప్పండి...లేదంటే.. | Ministry orders real name usage for all phones by next June | Sakshi
Sakshi News home page

అసలు పేర్లు చెప్పండి...లేదంటే..

Published Wed, May 25 2016 1:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

Ministry orders real name usage for all phones by next June

న్యూఢిల్లీ : మోసపూరిత చర్యలకు అడ్డుకట్టవేసేందుకు... ఫోన్లు వాడే యూజర్లందరూ పూర్తి వాస్తవ పేర్లను 2017 జూన్ 30 వరకూ టెలికాం కంపెనీల దగ్గర నమోదుచేయాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. అన్ని టెలీ కమ్యూనికేషన్ కంపెనీలు పూర్తి వాస్తవ పేరు వ్యవస్థను అమలు చేయాలని తెలిపింది. ఒకవేళ యూజర్లు ఈ వివరాలను డెడ్ లైన్ లోపు నమోదుచేయని పక్షంలో వారికి సర్వీసులు కట్ చేయాలని పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు టెలికాం కంపెనీ వాస్తవ పేర్ల యూజర్ల జాబితాను 95శాతం పెంచాలని, వచ్చే జూన్ వరకూ 100శాతం ఉండాలని నిర్దేశించింది.

టెలికాం కంపెనీలు సైతం గడువులోపు తమ వాస్తవ పేర్లను నమోదుచేసుకోవాలని యూజర్లను కోరాయి. టెస్ట్ మెసేజ్ లు, ఫోన్ కాల్స్, లెటర్స్, నోటీసుల రూపంలో ఈ విషయాన్ని యూజర్లకు కంపెనీలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం వాస్తవ పేర్లతో ఫోన్లను వాడే వారు 92శాతం ఉన్నారు. ఇంకా 1000లక్షల మంది వారి వాస్తవ గుర్తింపులను టెలికాం కంపెనీల దగ్గర నమోదుచేసుకోవాల్సి ఉంది. చైనాలో 2013లోనే వాస్తవ పేరు రిజిస్ట్రేషన్ వ్యవస్థ అమల్లో ఉంది. అయితే ఏప్రిల్ వరకూ 20 కంపెనీలు ఆఫర్ చేసిన 1,40,000 టెలిఫోన్ నెంబర్లు రద్దు అయ్యాయి. మోసపూరిత చర్యలకు పాల్పడటం వల్ల వీటిని రద్దుచేశారు. వాస్తవ పేరు నమోదు లేకపోవడం వల్ల స్పామర్లని కనుక్కోవడం కష్టతరమవుతుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో మోసపూరిత చర్యలకు పాల్పడే వారిని తేలికగా కనుగొనేందుకు వాస్తవ పేరు నమోదువ్యవస్థను అమలుచేయాలని  సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement