గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్‌లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్‌ను ప్రశంసించారు.
ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్‌కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్‌లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.
సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment