
బీజేపీది అనవసర రాద్ధాంతం : సీఎం
భూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న బీజేపీ డిమాండ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. బీజేపీ పేర్కొంటున్న మంత్రులపై వచ్చిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాలేదని అన్నారు.
అందువల్ల వారిని మంత్రి వర్గం నుంచి తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఉప ముఖ్యమంత్రులు ఆర్.అశోక్, కేఎస్ ఈశ్వరప్ప, మంత్రి సోమణ్ణలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని, అంతేకాక ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఆ సమయంలో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని బీజేపీ ఇప్పుడు తమనెందుకు ప్రశ్నిస్తోందో సమాధానం చెప్పాలని అన్నారు.