వాషింగ్టన్: అమెరికన్లకు ధరల స్పీడ్ సెగ కొనసాగుతోంది. ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 0.6 శాతం పెరిగింది (2022 డిసెంబర్‌తో పోల్చి). ఇక వార్షికంగా చూస్తే ఈ రేటు 4.7 శాతం ఎగసింది.
నవంబర్ నుంచి డిసెంబర్‌కు 0.2 శాతమే పెరిగితే, డిసెంబర్ నుంచి జనవరికి అంచనాలను మించి 0.6 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మున్ముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత పెంపునకే ఇది దారితీస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కాగా, వినియోగ వ్యయం జనవరిలో 1.8 శాతం పెరిగిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. తాజా గణాంకాల నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి అమెరికన్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment