న్యూఢిల్లీ: వాహనం కలిగిన ప్రతీఒక్కరూ తమ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు తప్పనిసరిగా వెళుతుంటారు. అయితే ఇలా వెళ్లేవారిలో చాలా మందికి అక్కడ లభించే ఉచిత సర్వీసులు గురించి ఏమాత్రం తెలియదు. వినియోగదారుల వాహన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను ఆయా పెట్రోల్ బంక్‌లు అందిస్తాయి. అవేమిటో వాహనదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. బంక్‌లు అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరి.. ఆ ఉచిత సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉచితంగా గాలిని కొట్టించుకోవచ్చు
ఏదైనా వాహనానికి గల టైర్లలో తగిన రీతిలో గాలి ఉండటం చాలా ముఖ్యం. పెట్రోల్ బంక్‌ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలికొట్టించుకోవచ్చు. బంక్‌లోగల ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా వాహనాల టైర్లలో గాలిని నింపుతారు. ఇందుకోసం బంక్‌లో ఒక ఉద్యోగిని నియమిస్తారు.
2.ఫైర్ సేఫ్టీ డివైజ్
ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే, అదే బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం వినియోగించుకున్నందుకు బంక్‌లో ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు.
3. అత్యవసర కాల్ సౌకర్యం
అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లోని టెలిఫోన్ నుంచి ఉచితంగా కాల్ చేయవచ్చు. అయితే వాహనదారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ జోరో అయినప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
4. ప్రథమ చికిత్స బాక్సు
వాహనదారులు ఏదైనా గాయం అయినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని మందులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ బాక్సులోని మందులు గడువు ముగియనివి అయి ఉండాలని గుర్తుంచుకోండి. పెట్రోల్ పంప్ యజమానులు ప్రథమ చికిత్స బాక్సులలోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి.
5. మంచినీటి సౌకర్యం
పెట్రోల్ పంపులో మంచినీటి సౌకర్యం కూడా ఉచితం. చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులు చల్లని, పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు.
6. ఉచిత వాష్‌రూమ్
వాహనదారులుతమ ప్రయాణంలో వాష్‌రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్‌లోని వాష్‌రూమ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ వాష్‌రూమ్‌లను సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంక్‌లోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.
చాలా మంది వాహనదారులకు బంక్‌లలో అందించే ఈ సేవల గురించి తెలియదు. ఫలితంగా వారు ఇబ్బందులకు ఎదుర్కొంటుంటారు. పెట్రోల్ బంక్ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సేవలను ఉచితంగా అందించడం తప్పనిసరి. పెట్రోల్ బంక్‌లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోయినా, లేదా ఇందుకోసం ఛార్జీలు విధించినా వినియోగదారులు ఆ పెట్రోలియం కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి, దానిలో ఫిర్యాదు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్‌ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
Comments
Please login to add a commentAdd a comment