ఏపీఈఆర్‌సీ 2022–23 నివేదిక విడుదల
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్)కు 2022–23లో 295 ఫిర్యాదులు అందగా.. వాటిలో 266 అదే ఏడాదిలో పరిష్కారమయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వెల్లడించింది. మండలి కార్యకలాపాలకు సంబంధించి 2022–23 ఆరి్థక సంవత్సరం నివేదికను ఏపీఈఆర్‌సీ సోమవారం విడుదల చేసింది. ఆ ఏడాదిలో సీజీఆర్‌ఎఫ్‌తో ఏపీఈపీడీసీఎల్‌లో 75 సార్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో 51 సార్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 13 సార్లు సమావేశమైనట్లు తెలిపింది.
ఏపీఈపీడీసీఎల్‌కు రూ.33,500 జరిమానా కూడా విధించినట్లు పేర్కొంది. విద్యుత్ అంబుడ్స్‌మెన్‌కు వచి్చన 29 ఫిర్యాదుల్లో 28 పరిష్కరించినట్లు వివరించింది. స్టాండర్డ్స్ ఆఫ్ ఫెర్ఫార్మెన్స్ (ఎస్‌వోపీ)లో డిస్కంలు విఫలమైన కేసుల్లో జరిమానా విధించినట్లు తెలిపింది. ఆ ఏడాది 48 కేసులను విచారించి ఆదేశాలు వెలువరించినట్లు తెలిపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అమోదించినట్లు వెల్లడించింది. మండలి ఖర్చులు, ఆదాయాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment