యాపిల్ ప్రొడక్ట్ ధరలు భారీగా ఉన్నాయి. వాటి సంగతేందో చూడండి అంటూ ఓ యువకుడు కేంద్ర విమానయాన శాఖకు ట్వీట్‌లో విజ్ఞప్తి చేశాడు. ఆ ట్వీట్‌పై చమత్కారంగా..చాలా స్పాంటేనియస్‌గా స్పందించడం నెటిజన్లను తెగ నవ్వులు పూయిస్తుంది.
అంకుర్ శర్మ అనే ట్విట్టర్ యూజర్ అమెజాన్ అన్ ఫెయిర్ బిజినెస్ చేస్తోంది. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినియోగదారు వ్యవహారాల శాఖ శాఖకు కాకుండా కేంద్ర విమానయాన సంస్థకు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో అమెజాన్ పేజ్‌లో ఐపాడ్ ప్రో ప్రొడక్ట్ ప్రారంభ ధర రూ.1,76,900 ఉండగా ధరను భారీగా తగ్గిస్తూ రూ.67,390కే అందిస్తున్నట్లు పేర్కొందని తెలుపుతున్నట్లుగా ఉన్న స్క్రీన్ షాట్‌లను షేర్ చేశాడు.
‘‘నెటిజన్ అంకుర్ శర్మ..ఆ ధరని, డిస్కౌంట్‌ను హైలెట్ చేస్తూ యాపిల్ ఐపాడ్ ప్రో రీటైల్ ధర రూ.1,76,900గా ఉంది. అదే ప్రొడక్ట్‌పై 62శాతం డిస్కౌంట్ ఇస్తుందంట అమెజాన్. సాధ్యం కాదు. అంత తక్కువ ధరకే ఐఫాడ్ రాదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
అంతేకాదు ఆ ట్వీట్‌ను జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు. అంతే ఆ ట్యాగ్‌పై విమానాయన శాఖ స్పాంటేనియస్‌గా రిప్లయి ఇచ్చింది. ‘‘తక్కువ ధరకే అందించాలని మాకు ఉంది. కానీ మేం ప్రయాణికులు అఫార్డబుల్ ప్రైస్‌కే ఇండియాకు వచ్చేలా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో బిజీగా ఉన్నాం’’ అని బదులిచ్చింది.
We intend to help, but we are busy providing affordable air travel to India.#SabUdenSabJuden https://t.co/ogDImlINJe
— MoCA_GoI (@MoCA_GoI) September 14, 2022
అదే ట్వీట్‌ను 8 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేయగా..700 మంది రీట్వీట్ చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హ్యూమరస్‌గా చేసిన ట్వీట్‌పై అమెజాన్ స్పందించింది. అంకుర్ శర్మ మీరు చేసిన ట్వీట్‌ను పరిగణలోకి తీసుకున్నాం. సంబంధిత విభాగానికి చెందిన ప్రతినిధులతో మాట్లాడుతున్నాం అని రిప్లయి ఇచ్చింది.
చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment