hilarious
-
ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ
-
రా..! సద్దాం. ఆట తమాషాగా ముగించేద్దాం..!!
-
యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ .. సూపర్ క్యూట్ సంయుక్త మీనన్
-
విమానయాన శాఖ ‘టైమింగ్ అదిరింది’..నవ్వులు పూయిస్తున్న రిప్లయ్!
యాపిల్ ప్రొడక్ట్ ధరలు భారీగా ఉన్నాయి. వాటి సంగతేందో చూడండి అంటూ ఓ యువకుడు కేంద్ర విమానయాన శాఖకు ట్వీట్లో విజ్ఞప్తి చేశాడు. ఆ ట్వీట్‌పై చమత్కారంగా..చాలా స్పాంటేనియస్‌గా స్పందించడం నెటిజన్లను తెగ నవ్వులు పూయిస్తుంది. అంకుర్ శర్మ అనే ట్విట్టర్ యూజర్ అమెజాన్ అన్ ఫెయిర్ బిజినెస్ చేస్తోంది. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినియోగదారు వ్యవహారాల శాఖ శాఖకు కాకుండా కేంద్ర విమానయాన సంస్థకు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అమెజాన్ పేజ్‌లో ఐపాడ్ ప్రో ప్రొడక్ట్ ప్రారంభ ధర రూ.1,76,900 ఉండగా ధరను భారీగా తగ్గిస్తూ రూ.67,390కే అందిస్తున్నట్లు పేర్కొందని తెలుపుతున్నట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. ‘‘నెటిజన్ అంకుర్ శర్మ..ఆ ధరని, డిస్కౌంట్‌ను హైలెట్ చేస్తూ యాపిల్ ఐపాడ్ ప్రో రీటైల్ ధర రూ.1,76,900గా ఉంది. అదే ప్రొడక్ట్‌పై 62శాతం డిస్కౌంట్ ఇస్తుందంట అమెజాన్. సాధ్యం కాదు. అంత తక్కువ ధరకే ఐఫాడ్ రాదు’’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. అంతేకాదు ఆ ట్వీట్‌ను జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు. అంతే ఆ ట్యాగ్‌పై విమానాయన శాఖ స్పాంటేనియస్‌గా రిప్లయి ఇచ్చింది. ‘‘తక్కువ ధరకే అందించాలని మాకు ఉంది. కానీ మేం ప్రయాణికులు అఫార్డబుల్ ప్రైస్‌కే ఇండియాకు వచ్చేలా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో బిజీగా ఉన్నాం’’ అని బదులిచ్చింది. We intend to help, but we are busy providing affordable air travel to India.#SabUdenSabJuden https://t.co/ogDImlINJe — MoCA_GoI (@MoCA_GoI) September 14, 2022 అదే ట్వీట్‌ను 8 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేయగా..700 మంది రీట్వీట్ చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హ్యూమరస్‌గా చేసిన ట్వీట్‌పై అమెజాన్ స్పందించింది. అంకుర్ శర్మ మీరు చేసిన ట్వీట్‌ను పరిగణలోకి తీసుకున్నాం. సంబంధిత విభాగానికి చెందిన ప్రతినిధులతో మాట్లాడుతున్నాం అని రిప్లయి ఇచ్చింది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్
Kareena Kapoor Denies Pregnancy Rumours: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో కరీనా కపూర్‌కు 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రాలో వివాహమైన విషయం తెలిసిందే. కరీనా-సైఫ్ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జేహ్) ఇద్దరు కుమారులు. అయితే తాజాగా కరీనా కపూర్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన కరీనా ఆసక్తికరమైన పోస్ట్‌తో సమాధానమిచ్చింది. ప్రస్తుతం సైఫ్, ఇద్దరి పిల్లలతో వెకేషన్లో ఉంది కరీనా. ఈ వెకెషన్‌కు సంబంధించిన ఒక ఫొటోను ఇటీవల పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. అందుకు కారణం ఆ ఫొటోలో కరీనా పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే. దీంతో కరీనా మళ్లీ గర్భవతి అయిందని పుకార్లు చెలరేగాయి. ఈ వార్తలపై కరీనా స్పందిస్తూ 'ఇది కేవలం పాస్తా, వైన్ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్ చెప్పాడు' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దీంతో కరీనా ప్రెగ్నెంట్ రూమర్స్‌కు చెక్ పడినట్లయింది. కాగా కరీనా కపూర్ తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో 'రూప'గా నటించిన విషయం తెలిసిందే. చదవండి: చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. Kareena and Saif spotted in London with friends pic.twitter.com/HBhGOQvKtm — Kareena Kapoor Khan (@KareenaK_FC) July 15, 2022 చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
వీళ్లిద్దరూ కలిస్తే ఫన్ కి నో ఎండ్
-
కాలు మీద కాలు
ఒక చెట్టు మీద ఒక కాకి రోజంతా అలాగే కూర్చొని ఉంది. కాలి నొప్పో, కంటి నొప్పో అయి కూర్చోవడం కాదు. ఉల్లాసంగా, విలాసంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది! కిందికి, పైకి, పక్కలకు ముక్కు కదపడం ఒక్కటే అది చేస్తున్న పని. ఓ కుందేలు ఉదయాన్నే ఆహారం వెతుక్కుంటూ చెట్టు కిందికి గెంతుకుంటూ వచ్చి, చెట్టు పైన కూర్చొని ఉన్న ఆ కాకిని చూసింది. మళ్లొకసారి అటు గెంతుతూ, ఇటు గెంతుతూ చెట్టు పైకి చూసింది. కాకి ఆ కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయినా అలాగే కూర్చొని ఉంది. సాయంత్రం కావస్తున్నా అలాగే కూర్చొని ఉంది. ‘ఆహా.. తిండి తిప్పల్లేకుండా, చీకూచింతా లేకుండా ఎంత హాయిగా బతుకుతోంది ఈ కాకి’ అనుకుంది. ఇక ఉండబట్టలేక, ‘‘కాకిగారూ.. నేను కూడా మీలాగే రోజంతా పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతిగా కూర్చొవచ్చా?’’ అని అడిగింది. ‘ఓ.. ఎందుక్కూర్చోకూడదూ? తప్పకుండా కూర్చోవచ్చు కుందేలు పిల్లా’’ అంది కాకి. కుందేలుకు సంతోషం వేసింది. ఆ చెట్టు కిందే తీరిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన నక్క.. కుందేలును నోట కరుచుకుని వెళ్లింది. ఇందులో నీతి ఏమిటంటే.. పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని! -
హాస్యం అంటే భయమన్న మోదీ ఏం చేశారు?
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉండడం అందరికీ తెలిసిందే. అలాగే జాతీయ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా.. బీజేపీ పార్టీ గుర్తుతో దిగిన సెల్ఫీ దగ్గరనుంచి మొదలు పెడితో ఆయన సెల్ఫీల హడావిడి.. సరదా కూడా మామూలుది కాదు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇపుడు ఒక జాతీయ పత్రికలో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చేసిన ట్విట్ ఒకటి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అవును .. ఆర్నబ్ గోస్వామి తో టెలివిజన్ సంభాషణ గురించి చెబుతూ .. ఆర్నబ్ గోసామితో నిర్మిహమాటంగా తాను ఏం షేర్ చేశానో...జాతి తెలుసుకోవాలనుకుంటోందా... అయితే చూడండి. అంటూ ట్విట్ చేసి తన హాస్య చతురతను చాటుకున్నారు. కొంచెం వినోదాత్మకంగా..మరికొంచెం కొంటెగా ట్వీట్ చేసిన ప్రధాని ..తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. 'ద నేషన్ నీడ్స్ టు నౌ ' అనగానే దాదాపు అందరికీ గుర్తు వచ్చే పేరు టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నబ్ గోస్వామి. ఈ నేపథ్యంలో ఆర్నబ్ ను ఇమిడిటేట్ చేస్తూ మోదీ తన రాబోయే టెలివిజన్ ఇంటర్వ్యూ గురించి తన అనుచరులను అప్రమత్తం చేసేందుకు ట్విట్టర్ ను సోమవారం ఇలా వాడుకున్నారన్నటమాట. అలాగే ఇపుడు హాస్యాన్ని వెనక్కి తెచ్చుకోవాలనే విషయాన్ని జాతి తెలుసుకుంటే మంచిదనే సందేశాన్ని కూడా మోదీ అందించారు. సోమవారం నాటి ఇంటర్వ్యూలో తన ప్రభుత్వ పథకాలు, విజయాలు ఆర్థిక వృద్ది గురించి మాట్లాడిన ప్రధాని.....ప్రస్తుత రోజుల్లో హాస్యం ప్రమాదకరంగామారిందని వ్యాఖ్యానించారు. 24/7 వార్తా ఛానెల్స్ రాజ్యం ఏలుతున్న ప్ర్తస్తుత తరుణంలో ఏం మాట్లాడినా ప్రమాదంగానే ఉందనీ... ఎవరో ఒకరు ఏదో ఒక తప్పును పట్టుకోవడం, వివాదం సృష్టించడం పరిపాటిగా మారింపోయిందన్నారు. ఈ సందర్భంగా తన్మయ్ భట్ ఉందంతాన్ని ప్రస్తావించారు. అందుకే సాధారణంగా సరదాగా ఉండే తాను కూడా చాలా సీరియస్ గామారిపోయానని తెలిపారు. తన పార్లమెంట్ ప్రసంగాల్లో కూడా ఇదే ధోరణి ఉంటుందన్నారు. ఒక విధంగా హాస్యం అంటే తనకు భయంగా పట్టుకుందన్నారు. ఈ భయం ప్రజా జీవితంలో కూడా ఉందనీ, హాస్యం ముగిసిపోయిందని ఇది ఆందోళన కలిగించే విషయమని మోదీ పేర్కొన్నారు. Does the nation want to know what I frankly shared with Mr. Arnab Goswami? Find out 6 PM onwards on @timesnow. pic.twitter.com/Q8fPxVpYwk — Narendra Modi (@narendramodi) 27 June 2016