అజియో ఆన్‌లైన్‌ మెగా ట్రేడ్‌ షో | Ajio Launches Online Trade Show | Sakshi
Sakshi News home page

19 వరకు 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షో

Published Thu, Sep 17 2020 6:46 PM | Last Updated on Thu, Sep 17 2020 6:46 PM

Ajio Launches Online Trade Show - Sakshi

సాక్షి, హైదరాబాద్ :  రిలయన్స్ రిటైల్ కు చెందిన ఫ్యాషన్ వేర్ ఆన్‌లైన్‌ వేదిక అజియో 'సంబంధం- 2020' పేరుతో ఆన్‌లైన్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌ షో ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణాలు చేసే రిస్క్‌ను తగ్గించేందుకు రిటైలర్లకు ఈ వేదికను అజియో అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాపారులు తమకు కావాల్సిన దుస్తుల్నికొనుగోలు చేసేందుకు 'సంబంధం డిజిటల్ ఫెస్టివల్ 2020' వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తోంది.

సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ మెగా ట్రేడ్ షో సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఈ ట్రేడ్ షోలో రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు కావాల్సిన దుస్తులను కొనుగోలు చేయవచ్చు. దుస్తులతో పాటు ఆఫీసులు, ఇళ్లకు కావాల్సిన లగ్జరీ, సేఫ్టీ ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఈవెంట్‌లో దేశానికి చెందిన 70,000కు పైగా రిటైలర్లు పాల్గొంటారని అంచనా. అజియో 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షోలో 1,300 పైగా బ్రాండ్లకు చెందిన లక్షలాది స్టైల్స్ అందుబాటులో ఉన్నాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టీవ్ కలెక్షన్ రూపొందించారు. చదవండి : అజియో బిగ్‌ సేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement