AJIO announces Big Bold Sale: Get Discounts and Prizes - Sakshi
Sakshi News home page

Ajio Big Bold Sale: అజియో ‘బిగ్‌బోల్డ్‌’ సేల్‌.. భారీ డిస్కౌంట్లతోపాటు బహుమతులు!

Published Tue, May 30 2023 7:28 AM | Last Updated on Tue, May 30 2023 10:57 AM

ajio announces big bold sale discounts and prizes - Sakshi

ముంబై: అజియో ‘బిగ్‌ బోల్డ్‌ సేల్‌’ (Ajio Big Bold Sale) పేరుతో ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్‌ 1 నుంచి మొదలు కానుంది. ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్, హోమ్, డెకార్, బ్యూటీ, జ్యువెలరీ, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులపై మంచి డీల్స్‌ను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డు చెల్లింపులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.

ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఉత్పత్తులపై 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. బిగ్‌బోల్డ్‌ సేల్‌లో అధిక కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు ఐఫోన్‌ 14ప్రో, యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ఎయిర్, రూ.లక్ష విలువైన బంగారం, శామ్‌సంగ్‌ ఎస్‌23ను ఇస్తున్నట్టు పేర్కొంది. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు రూ.3 లక్షల విలువైన బంగారం గెలుచుకోవచ్చని ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement