రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్‌తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్‌లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్‌తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్‌ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్‌మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
సౌకర్యవంతమైన లెగ్‌స్పేస్ ఉంటుంది.
దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.
మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.
ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.
క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్‌లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.
పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment