చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి.
దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్‌లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్‌లుగా ఎదుగుతున్నాయి.
ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్‌లు..
- శిఖర్‌ధావన్: అప్‌స్టాక్స్, ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు.
- సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు.
- శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు.
- విరాట్‌కోహ్లీ: ఎంపీఎల్, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు.
- అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్‌ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు.
- ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్‌లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment