Kapoor
-
రికార్డ్ బ్రేక్ మూవీతో వస్తోన్న జయసుధ కుమారుడు..!
నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోకు వచ్చి సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు వాళ్లకు.. సంబంధించిన రైతులకు.. అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే వచ్చిన దర్శకులు విజయేంద్రప్రసాద్, జయసుధ , ఆర్ నారాయణ మూర్తి , రైటర్ చిన్ని కృష్ణ , దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్ గురించి దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా. ఇది ఒక కొత్త అటెంప్ట్. చదలవాడ శ్రీనివాసరావు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. ఆర్. నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అనే విలువలున్నాయి. ఈ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. జయసుధ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నిహార్ నటించడం చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా.. ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్లో నేను చాలా సినిమాల్లో నటించాను. చదలవాడ శ్రీనివాసరావుతో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సత్య కృష్ణ, ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్‌లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్‌లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్‌లు.. శిఖర్‌ధావన్: అప్‌స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్‌కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్‌ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు. -
యస్ బ్యాంక్ కపూర్‌కు ఆర్బీఐ నో
న్యూఢిల్లీ: ఎస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాణా కపూర్ పదవీకాలాన్ని బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కుదించింది. 2019 జనవరి 31 నాటికి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రైవేటు దిగ్గజ బ్యాంక్‌కు ఆర్బీఐ స్పష్టం చేసింది. 2004లో బ్యాంకును ప్రారంభించిన నాటి నుంచీ రాణా కపూర్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021 ఆగస్టు 31 వరకూ పదవీ కాలాన్ని పొడిగించాలని కపూర్ చేసిన విజ్ఞప్తిని ఆర్బీఐ తిరస్కరించింది. 2019 జనవరి వరకే కొనసాగడానికి అనుమతిని ఇచ్చింది. 25న బ్యాంక్ బోర్డ్ సమావేశం... అయితే ఈ అంశంపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ నెల 25న సమావేశం కానున్నారు. యస్ బ్యాంక్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐ తుది ఆమోదానికి లోబడి, కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించడానికి ఈ ఏడాది జూన్‌లో బ్యాంక్ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. నిజానికి ఆయన ప్రస్తుత పదవీకాలం ఆగస్టు 31తో ముగిసింది. అయితే తదుపరి నోటీసు వచ్చే వరకూ బాధ్యతల్లో కొనసాగడానికి ఆగస్టు 30న ఆర్బీఐ అనుమతి జారీచేసింది. అప్పట్లో నిర్దిష్ట సమయాన్ని వెల్లడించని ఆర్బీఐ, తాజాగా ఇందుకు 2019 జనవరిని తుది గడువుగా ప్రకటించింది. ప్రమోటర్‌గా కపూర్ ఆయన కుటుంబానికి బ్యాంక్‌లో 10.66 శాతం వాటా ఉంది. శిఖా తరహాలోనే...: గతంలో ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్– సీఈఓ శిఖా శర్మ పదవీ కాలం మూడేళ్ల పొడిగింపునకు బోర్డ్ ఆమోదముద్ర వేసింది. దీనికి ఆర్బీఐ అంగీకరించలేదు. -
ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం!
ప్రేమికుల రోజుకు వయసుతో పని లేదంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. ప్రేమను పంచుకోడానికి వయసుతో సంబంధం లేదని సందేశం ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే ప్రతివారూ జరుపుకోదగ్గ రోజన్న విషయం... ప్రతివారికీ తెలియాలని ఆయన ట్వీట్ చేశారు. లవ్.. రొమాన్స్ యువతకు మాత్రమే పరిమితం కాదంటున్నారు. ఏభై ఏళ్ళ వివాహ జీవితాన్ని పూర్తి చేసిన రిషికపూర్.. దంపతుల్లో ఉండే ప్రేమను నిరూపించే ఓ హార్ట్ టచ్చింగ్ వీడియోను యూట్యూబ్.. కాట్ ఇన్ యాక్షన్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఒకరికోసం ఒకరు అనేందుకు ఇప్పుడా వీడియో తార్కాణంగా నిలుస్తోంది. ఒకరి ఆహారంపట్ల ఒకరు శ్రద్ధ చూపించడం, సమయానికి మందులు గుర్తు చేయడం, ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ ప్రేమను నిలబెడతాయని... ఆప్యాయత అనురాగాన్నీ పెంచుతాయని, నిస్వార్థంగా బతికేలా చేస్తాయని ఆ దంపతులను చూస్తే అర్థమౌతుంది. ఇప్పటిదాకా ఆమె దృష్టిలో నేనొక్క పని కూడా సరిగా చేయలేదని.. అయితే వివాహ జీవితం 54 ఏళ్ళు సజావుగా సాగిపోయిందని రిషికపూర్ నవ్వుతూ చెప్తున్నారు. జీవితాంతం వాలెంటైన్ గా ఉండాలనుకున్నవారు మరి ఆ అన్యోన్య దాంపత్యాన్ని వీక్షించాల్సిందే... So true.... You never too old for Valentines Day! Well done Sarah https://t.co/5KQs94GSqz — Rishi Kapoor (@chintskap) February 11, 2016