రికార్డ్ బ్రేక్ మూవీతో వస్తోన్న జయసుధ కుమారుడు..! | Jayasudha Son Nihar Kapoor latest Movie Record Break Release Tomorrow | Sakshi
Sakshi News home page

Record Break Movie: మహాశివరాత్రికి వస్తోన్న 'రికార్డ్ బ్రేక్'.. అలాంటి సెంటిమెంట్‌తో!

Published Thu, Mar 7 2024 10:01 PM | Last Updated on Thu, Mar 7 2024 10:06 PM

Jayasudha Son Nihar Kapoor latest Movie Record Break Release Tomorrow - Sakshi

నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోకు వచ్చి సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు వాళ్లకు.. సంబంధించిన రైతులకు.. అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే వచ్చిన దర్శకులు విజయేంద్రప్రసాద్, జయసుధ , ఆర్ నారాయణ మూర్తి , రైటర్ చిన్ని కృష్ణ , దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్ గురించి దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా. ఇది ఒక కొత్త అటెంప్ట్. చదలవాడ శ్రీనివాసరావు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. ఆర్. నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అనే విలువలున్నాయి. ఈ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు.

జయసుధ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నిహార్ నటించడం చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా.. ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్‌లో నేను చాలా సినిమాల్లో నటించాను. చదలవాడ శ్రీనివాసరావుతో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సత్య కృష్ణ, ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement