చదలవాడ శ్రీనివాసరావు
‘‘గతంలో డైరెక్టర్,ప్రోడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్టర్, హీరో ఒక్కటై నిర్మాతకి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే ప్రధాన సమస్య. నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేనింత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే’’ అని దర్శక–నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘బిచ్చగాడు’లో తల్లి కోసం కొడుకు కష్టపడతాడు. కానీ, ‘రికార్డ్ బ్రేక్’లో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. కథ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమాని అయినా ఆదరిస్తారని మా ‘బిచ్చగాడు’ నిరూపించింది. అదే నమ్మకంతోనే బడ్జెట్‌కి వెనకాడకుండా ‘రికార్డ్ బ్రేక్’ తీశాం. యునిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. గతంలో నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ గార్లతో సినిమాలు తీశాను. వాళ్లు నాకంటే ముందే షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారు. డైరెక్టర్లు అజయ్ కుమార్, సదాశివరావు, కేఎస్ నాగేశ్వరరావు కూడా మహాను భావులు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment