
వసంత్ సమీర్
‘‘మాది విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి దగ్గర చోడవరం. మూడో తరగతి అప్పుడు హైదరాబాద్‌కి వచ్చేశాం. మా నాన్నగారు రైటర్ విజయేంద్రప్రసాద్ గారి దగ్గర రైటర్‌గా పనిచేశారు. అలా నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే పిచ్చి మొదలైంది’’ అన్నారు వసంత్ సమీర్. నాగు గవర దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన ‘కర్త కర్మ క్రియ’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు వసంత్. గత గురువారం ఈ చిత్రం విడుదలైన సందర్భంగా వసంత్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ నాగు గారు నాతో ఓ ట్రైల్ షూట్ చేసి నిర్మాత శ్రీనివాసరావుగారికి చూపించారు.
వెంటనే ఆయన ఓకే అన్నారు. అలా సినిమా స్టార్ట్ అయ్యి ఎక్కడా బ్రేక్ లేకుండా జరిగిపోయింది. 2016లో నా ఇంజనీరింగ్ అయిపోగానే సినిమా చాన్సుల కోసం ట్రైల్స్‌లో ఉన్నాను. రెండేళ్లుగా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తూనే విజయేంద్రప్రసాద్ గారి దగ్గర రైటర్‌గా ఆయన చేస్తున్న ‘క్రాస్ రోడ్స్’ అనే షోకి 39 ఎపిసోడ్స్‌కి పనిచేశాను. ఆ షో చేస్తున్న టైమ్‌లో హీరోగా అవకాశం వచ్చింది. సినిమా రిలీజ య్యాక అందరూ ఫోన్లు చేసి నీ వాయిస్ బావుంది, బాగా నటించావని అభినందిస్తుంటే హ్యాపీగా ఉంది. మరో మూడు అవకాశాలు ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment