కలవరం సినిమా మొదలుపెట్టిన 'హిట్‌ లిస్ట్‌' హీరో | Vijay Kanishka Starrer Kalavaram Movie Launched | Sakshi
Sakshi News home page

'హిట్‌ లిస్ట్‌' ఫేమ్‌ విజయ్‌ కనిష్క హీరోగా 'కలవరం' సినిమా ప్రారంభం

Published Sat, Jan 4 2025 8:40 PM | Last Updated on Sat, Jan 4 2025 8:40 PM

Vijay Kanishka Starrer Kalavaram Movie Launched

విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కలవరం.  సిఎల్ఎన్  మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ నిర్మితమవుతోంది. శశాంక్ కథ అందించిన ఈ చిత్రానికి హనుమాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస సంగీతం అందించాడు.  వెంకట్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. శనివారం (జనవరి 4న) ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ చేతుల మీదుగా కలవరం చిత్రాన్ని లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. ఇది బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఉన్న  సినిమా. చిన్న సినిమాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పించాలి. చిన్న చిత్రాలకు షోలు ఎక్కువ ఇవ్వడం, అదేవిధంగా మినీ థియేటర్లు కట్టి సపోర్ట్ ఇవ్వాలి. కలవరం చాలా మంచి టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హీరో హీరోయిన్లకు, చిత్రయూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ.. ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి గారు హామీ ఇచ్చారు. వెంటనే చెన్నై వెళ్లి హీరోకి కథ చెప్పాము. హీరో విజయ్ కనిష్కకు కూడా ఈ కథ చాలా నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నామన్నారు.  ఈ రోజు ఇలా గ్రాండ్‌గా ప్రారంభించాం. నన్ను నా కథను నమ్మి నాకే అవకాశం ఇచ్చిన శోభ రాణికి, హీరో విజయ్ కనిష్కకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ : మా నాన్న విక్రమం తమిళంలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నా మొదటి సినిమా హిట్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పేరు నిలబెట్టావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎగ్జయిటయ్యాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మంచి సినిమాలు, కొత్త టాలెంట్ ఇంకా ఎంతోమంది మీ ముందుకు వస్తారు అన్నారు.

కథా రచయిత శశాంక్. పి మాట్లాడుతూ.. కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన నిర్మాత శోభారాణికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను, డైరెక్టర్ హనుమాన్ కలిసే స్క్రిప్ట్‌ తయారు చేశాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత శోభారాణి గారు మాట్లాడుతూ.. కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. శశాంక్, హనుమాన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అదే కష్టంతో ఇష్టంగా ఈ సినిమాని పూర్తి చేస్తాము. అడగ్గానే మా సినిమా ఓపెనింగ్‌కు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు, సి  కళ్యాణ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాము అన్నారు.

చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement