Chadalavada Srinivasa Rao
-
రికార్డ్ బ్రేక్ మూవీ రివ్యూ
మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. కోటీశ్వరులకు జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వల్ల అనాథలుగా మారతారు. ఆ ఇద్దరు అనాథలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ రెజ్లింగ్ ఛాంపియన్స్‌గా ఎలా నిలిచారు? అలాంటి అనాథలకు స్నేహితురాలు అయిన ఒక అమ్మాయి వాళ్లకు తల్లిగా ఎలా మారింది? వాళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే! ఈ మూవీలో రైతుల గురించి తల్లి సెంటిమెంట్ గురించి చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే? కొత్త వాళ్లయినా కూడా నిహారి కపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా బాగా నటించారు. సత్య కృష్ణ పాత్ర సినిమా మొత్తానికే హైలైట్. విలన్‌గా టి. ప్రసన్నకుమార్ చాలా బాగా నటించారు. మిగతావాళ్లు తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు ఎంచుకున్న కథ కాస్త పాతదే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండటం, అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్ ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తాయి. అయితే కొన్నిచోట్ల దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సాబు వర్గీస్ సంగీతం పర్వాలేదు. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ బాగుంది. చదవండి: ‘భీమా’ మూవీ రివ్యూ -
పెద్ద హీరోలతో సినిమాలు చేయను: ప్రముఖ దర్శకనిర్మాత
‘‘గతంలో డైరెక్టర్,ప్రోడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్టర్, హీరో ఒక్కటై నిర్మాతకి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే ప్రధాన సమస్య. నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేనింత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే’’ అని దర్శక–నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘బిచ్చగాడు’లో తల్లి కోసం కొడుకు కష్టపడతాడు. కానీ, ‘రికార్డ్ బ్రేక్’లో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. కథ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమాని అయినా ఆదరిస్తారని మా ‘బిచ్చగాడు’ నిరూపించింది. అదే నమ్మకంతోనే బడ్జెట్‌కి వెనకాడకుండా ‘రికార్డ్ బ్రేక్’ తీశాం. యునిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. గతంలో నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ గార్లతో సినిమాలు తీశాను. వాళ్లు నాకంటే ముందే షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారు. డైరెక్టర్లు అజయ్ కుమార్, సదాశివరావు, కేఎస్ నాగేశ్వరరావు కూడా మహాను భావులు’’ అన్నారు. -
పెద్ద హీరోలతో సినిమాలు చేయను: చదలవాడ శ్రీనివాసరావు
‘గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి రికార్డు బ్రేక్ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘రికార్డు బ్రేక్’. నిహిర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం. ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ‘రికార్డు బ్రేక్’ తెరకెక్కించాను. ► అప్పట్లో నేను తీసిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది. ► ఇప్పటికే కొంతమందికి సినిమా చూపించాం. చూసిన ప్రతివారు కూడా చాలా బాగుంది అన్నారు. ఆర్.నారాయణమూర్తి గారు సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి గారు రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల ఇన్పుట్స్ తీసుకుని 2. 45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది. ► ఈ సినిమాను ముందుగా తక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నిమా సక్సెస్ తర్వాత థియేటర్ల సంఖ్యను పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ► ‘బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది. ► గతంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్ కి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం.నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.నేను గతంలో చేసిన శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్ సదాశివరావు కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మహానుభావులు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచట్లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ► రికార్డు బ్రేక్ ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్నాను. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను. -
నా దృష్టిలో నిర్మాతలే హీరోలు
‘‘నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాస్. లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదలవుతోంది. ‘‘ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారితో మా బ్యానర్లో 15 సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాస్. -
కమలాకర్ రెడ్డి మృతి తీరని లోటు
‘‘పంపిణీదారుడు, నిర్మాత గుండాల కమలాకర్ రెడ్డి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆయన సంతాప సభలో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం ‘అభయ్’ సినిమాతో కమలాకర్ రెడ్డి, జనార్దన్ నాకు పరిచయం. కమలాకర్ మన మధ్య లేకపోయినా అతని మంచి ఆశయాలు మనతోనే ఉంటాయి’’ అన్నారు. ‘‘300 యోధులు, 1000 బీసీ, బలాదూర్’ వంటి ఎన్నో మంచి చిత్రాలను పంపిణీ చేశారు కమలాకర్ రెడ్డిగారు. ముంబయ్‌లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కమలాకర్‌గారి కె.ఎఫ్.సి సంస్థను సంప్రదించేవి. జనార్దన్‌గారు కమలాకర్‌గారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్. ‘‘మంచి సినిమాలు చేస్తూ పంపిణీదారునిగా మంచి పేరున్న కమలాకర్ రెడ్డిగారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం’’ అని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, నిర్మాత ముత్యాల రామ్‌దాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ‘ఈనాడు’ సినిమా నిర్మాత కుమార్ బాబు, ‘మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైటర్ టు హీరో
‘‘మాది విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి దగ్గర చోడవరం. మూడో తరగతి అప్పుడు హైదరాబాద్‌కి వచ్చేశాం. మా నాన్నగారు రైటర్ విజయేంద్రప్రసాద్ గారి దగ్గర రైటర్‌గా పనిచేశారు. అలా నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే పిచ్చి మొదలైంది’’ అన్నారు వసంత్ సమీర్. నాగు గవర దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన ‘కర్త కర్మ క్రియ’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు వసంత్. గత గురువారం ఈ చిత్రం విడుదలైన సందర్భంగా వసంత్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ నాగు గారు నాతో ఓ ట్రైల్ షూట్ చేసి నిర్మాత శ్రీనివాసరావుగారికి చూపించారు. వెంటనే ఆయన ఓకే అన్నారు. అలా సినిమా స్టార్ట్ అయ్యి ఎక్కడా బ్రేక్ లేకుండా జరిగిపోయింది. 2016లో నా ఇంజనీరింగ్ అయిపోగానే సినిమా చాన్సుల కోసం ట్రైల్స్‌లో ఉన్నాను. రెండేళ్లుగా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తూనే విజయేంద్రప్రసాద్ గారి దగ్గర రైటర్‌గా ఆయన చేస్తున్న ‘క్రాస్ రోడ్స్’ అనే షోకి 39 ఎపిసోడ్స్‌కి పనిచేశాను. ఆ షో చేస్తున్న టైమ్‌లో హీరోగా అవకాశం వచ్చింది. సినిమా రిలీజ య్యాక అందరూ ఫోన్లు చేసి నీ వాయిస్ బావుంది, బాగా నటించావని అభినందిస్తుంటే హ్యాపీగా ఉంది. మరో మూడు అవకాశాలు ఉన్నాయి’’ అన్నారు. -
‘బిచ్చగాడు’లా హిట్ అవ్వాలి
‘‘మా సంస్థ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సినిమాలకంటే వైవిధ్యంగా ‘కర్త కర్మ క్రియ’ ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది’’ అని సమర్పకులు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. వసంత్ సమీర్, సెహర్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాగు గవర కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్‌గా ఈ సినిమాను బాధ్యతగా తీశారు. మా బ్యానర్లో సూపర్ హిట్ అయిన ‘బిచ్చగాడు’ సినిమా తరహాలో ‘కర్త కర్మ క్రియ’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేశాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెర కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగు గవర. ‘‘ఓ మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని వసంత్ సమీర్, సెహర్ అన్నారు. -
నిర్మాతతో విభేదాలపై జయసుధ క్లారిటీ!
సీనియర్ నటి జయసుధ ప్రస్తుతం ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తున్న ‘హెడ్ కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొద్దిరోజుల కిందట నిర్మాతకు, జయసుధకు మధ్య అపార్థాల వల్ల విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరోజు షూటింగ్ వాయిదా పడింది. చిత్ర వర్గాల ప్రకారం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిర్ణీత సమయంలోగా జయసుధకు దుస్తులు అందించలేకపోయింది. దీంతో ఆమె కొంతవేచి చూసి.. ఆలస్యంగా షూటింగ్‌కు వచ్చింది. విషయం తెలియని నిర్మాత ఆగ్రహానికి లోనయ్యాడు. జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలు వేశాడు. నిర్మాత కోపానికి గురైన విషయం తెలియడంతో జయసుధ ఆయనకు వివరణ ఇచ్చింది. ఇందులో తన తప్పేం లేదని తెలిపింది. గత 30 ఏళ్లుగా జయసుధ తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటున్నది. ఇందుకోసం ఒకరోజు ముందుగానే దర్శకుడితో సంబంధిత సీన్లోవేసుకోవాల్సిన దుస్తుల కోసం ఆమె చర్చిస్తుంది. దీనిపై జయసుధ మీడియాతో స్పందిస్తూ ‘ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న అపార్థం వల్ల ఇది జరిగింది. దర్శకుడు నాకు ఫోన్ చేశాడు. ఎలాంటి జాప్యం లేకుండా డిసెంబర్ 3 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది’ అని తెలిపారు. ఆర్ నారాయణమూర్తి కోసమే ఈ సినిమాను జయసుధ ఒప్పుకొన్నట్టు సన్నిహత వర్గాలు తెలిపాయి. -
నగ్నసత్యం మూవీ స్టిల్స్