పెద్ద హీరోలతో సినిమాలు చేయను:  చదలవాడ శ్రీనివాసరావు | Chadalavada Srinivasa Rao Talk About Record Break Movie | Sakshi
Sakshi News home page

పెద్ద హీరోలతో సినిమాలు చేయను:  చదలవాడ శ్రీనివాసరావు

Published Tue, Mar 5 2024 5:16 PM | Last Updated on Tue, Mar 5 2024 5:25 PM

Chadalavada Srinivasa Rao Talk About Record Break Movie - Sakshi

‘గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి  రికార్డు బ్రేక్‌ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మించిన పాన్‌ ఇండియా మూవీ ‘రికార్డు బ్రేక్‌’. నిహిర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం. ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ‘రికార్డు బ్రేక్‌’ తెరకెక్కించాను. 

► అప్పట్లో నేను తీసిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది.

ఇప్పటికే కొంతమందికి సినిమా చూపించాం.  చూసిన ప్రతివారు కూడా చాలా బాగుంది అన్నారు. ఆర్.నారాయణమూర్తి గారు సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి గారు రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల ఇన్పుట్స్ తీసుకుని 2. 45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది.

ఈ సినిమాను ముందుగా తక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. నిమా సక్సెస్ తర్వాత థియేటర్ల సంఖ్యను పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం.

► ‘బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది.

► గతంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్ కి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం.నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.నేను గతంలో చేసిన శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్ సదాశివరావు కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మహానుభావులు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచట్లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

► రికార్డు బ్రేక్‌  ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్నాను. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement