Record Break Movie
-
రికార్డ్ బ్రేక్ మూవీ రివ్యూ
మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. కోటీశ్వరులకు జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వల్ల అనాథలుగా మారతారు. ఆ ఇద్దరు అనాథలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ రెజ్లింగ్ ఛాంపియన్స్‌గా ఎలా నిలిచారు? అలాంటి అనాథలకు స్నేహితురాలు అయిన ఒక అమ్మాయి వాళ్లకు తల్లిగా ఎలా మారింది? వాళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే! ఈ మూవీలో రైతుల గురించి తల్లి సెంటిమెంట్ గురించి చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే? కొత్త వాళ్లయినా కూడా నిహారి కపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా బాగా నటించారు. సత్య కృష్ణ పాత్ర సినిమా మొత్తానికే హైలైట్. విలన్‌గా టి. ప్రసన్నకుమార్ చాలా బాగా నటించారు. మిగతావాళ్లు తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు ఎంచుకున్న కథ కాస్త పాతదే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండటం, అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్ ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తాయి. అయితే కొన్నిచోట్ల దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సాబు వర్గీస్ సంగీతం పర్వాలేదు. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ బాగుంది. చదవండి: ‘భీమా’ మూవీ రివ్యూ -
రికార్డ్ బ్రేక్ మూవీతో వస్తోన్న జయసుధ కుమారుడు..!
నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోకు వచ్చి సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు వాళ్లకు.. సంబంధించిన రైతులకు.. అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే వచ్చిన దర్శకులు విజయేంద్రప్రసాద్, జయసుధ , ఆర్ నారాయణ మూర్తి , రైటర్ చిన్ని కృష్ణ , దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్ గురించి దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా. ఇది ఒక కొత్త అటెంప్ట్. చదలవాడ శ్రీనివాసరావు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. ఆర్. నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అనే విలువలున్నాయి. ఈ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. జయసుధ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నిహార్ నటించడం చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా.. ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్లో నేను చాలా సినిమాల్లో నటించాను. చదలవాడ శ్రీనివాసరావుతో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సత్య కృష్ణ, ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
పెద్ద హీరోలతో సినిమాలు చేయను: ప్రముఖ దర్శకనిర్మాత
‘‘గతంలో డైరెక్టర్,ప్రోడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్టర్, హీరో ఒక్కటై నిర్మాతకి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే ప్రధాన సమస్య. నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేనింత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే’’ అని దర్శక–నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘బిచ్చగాడు’లో తల్లి కోసం కొడుకు కష్టపడతాడు. కానీ, ‘రికార్డ్ బ్రేక్’లో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. కథ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమాని అయినా ఆదరిస్తారని మా ‘బిచ్చగాడు’ నిరూపించింది. అదే నమ్మకంతోనే బడ్జెట్‌కి వెనకాడకుండా ‘రికార్డ్ బ్రేక్’ తీశాం. యునిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. గతంలో నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ గార్లతో సినిమాలు తీశాను. వాళ్లు నాకంటే ముందే షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారు. డైరెక్టర్లు అజయ్ కుమార్, సదాశివరావు, కేఎస్ నాగేశ్వరరావు కూడా మహాను భావులు’’ అన్నారు. -
పెద్ద హీరోలతో సినిమాలు చేయను: చదలవాడ శ్రీనివాసరావు
‘గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి రికార్డు బ్రేక్ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘రికార్డు బ్రేక్’. నిహిర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం. ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ‘రికార్డు బ్రేక్’ తెరకెక్కించాను. ► అప్పట్లో నేను తీసిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది. ► ఇప్పటికే కొంతమందికి సినిమా చూపించాం. చూసిన ప్రతివారు కూడా చాలా బాగుంది అన్నారు. ఆర్.నారాయణమూర్తి గారు సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి గారు రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల ఇన్పుట్స్ తీసుకుని 2. 45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది. ► ఈ సినిమాను ముందుగా తక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నిమా సక్సెస్ తర్వాత థియేటర్ల సంఖ్యను పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ► ‘బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది. ► గతంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్ కి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం.నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.నేను గతంలో చేసిన శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్ సదాశివరావు కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మహానుభావులు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచట్లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ► రికార్డు బ్రేక్ ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్నాను. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.