
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) స్నేహితుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘మనోజ్ నా స్కూల్ ఫ్రెండ్. ఏం జరిగిందో తెలియదు కానీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. చాలా మంచి పర్సన్. అందరితో కలిసిపోయేవాడు. చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడంలేదు. చాలా బాధగా ఉంది. ఈ విషయం గురించి చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు.. అసలు ఏమైంది? ఎంత పని చేశావు రా నా కొడకా’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘అతని బాధ చెప్పుకోలేనిదే కావచ్చు...కానీ ఆత్మహత్య చేసుకోవడం తప్పు’, ‘ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే వచ్చిదంటే..అది ఎవరికీ చెప్పేకోలేనంత బాధ. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
సుహాస్ సినిమాల విషయాలకొస్తే.. యూట్యూబర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ టాలెంటెడ్ నటుడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది జనక అయితే గనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘ ఓ భామ అయ్యో రామ ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment