ట్విన్స్ హీరోలుగా వస్తోన్న తికమకతాండ.. రిలీజ్ ఎప్పుడంటే? | Thikamakatanda Movie Grand Pre Release Event | Sakshi
Sakshi News home page

Thikamakatanda Movie: మతిమరుపు కాన్సెప్ట్‌తో 'తికమకతాండ'.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Thu, Dec 7 2023 6:18 PM | Last Updated on Thu, Dec 7 2023 6:20 PM

Thikamakatanda Movie Grand Pre Release Event - Sakshi

హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ నిరోషా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం తికమకతాండ. ఈ చిత్రానికి వెంకట్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ..' తికమకతాండ డైరెక్టర్ వెంకట్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ట్విన్స్ టెక్నీషియన్స్‌గా వచ్చి హీరోలుగా ఎదిగారు. ట్విన్స్ రామ్, హరి ఇద్దరూ హీరోలుగా తెలుగ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. హీరోయిన్లు యాని, రేఖ నిరోషా అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement