Nagarajuna
-
'అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెంట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అలా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు. తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సైతం తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున ఫ్యామిలీకి మంత్రి క్షమాపణలు చెప్పకుండా.. సమంతను ఆమె కొనియాడారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. 'గన్ను గురిపెట్టింది కేటీఆర్‌కు అయితే.. కాల్చింది నాగార్జున, నాగచైతన్యలను అని.. కానీ చివరికీ సమంతకు సారీ చెప్పారు' .. అయితే ఈ సమీకరణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అర్థం చేసుకోవడం కష్టమేనని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నారు.కాగా.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపాయి. సమంత-నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడి ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.Her GUN was aimed at @KTRBRS and she SHOT @iamnagarjuna and @chay_akkineni and APOLOGIED to @Samanthaprabhu2 ..I DOUBT even ALBERT EINSTEIN can decipher this EQUATION 😳😳😳— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2024 -
గవర్నర్‌ను కలిసిన హీరో నాగార్జున
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆయన పరామర్శించారు. ఇటీవల ఆయన అస్వస్థకు గురయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న హరిబాబును కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఓ మూవీ షూటింగ్ కోసం విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు.(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)కాగా.. ఇప్పటికే నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సమంత- నాగచైతన్య విడాకులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ సినీ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వాటిని ఊపేక్షించేది లేదని చిరంజీవి, మంచువిష్ణు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు.విశాఖ: మిజోరాం గవర్నర్ ను కలిసిన సినీ హీరో అక్కినేని నాగార్జున ఆనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్ హరి బాబుకు నాగార్జున పరామర్శ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హరిబాబుఅక్కినేని తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హరిబాబు@iamnagarjuna #Vizag #Nagarjuna #Meets #MizoramGovernor pic.twitter.com/fcndH5nFNu— Akhil Raj (@RRajkumar135192) October 3, 2024 -
రికార్డ్ బ్రేక్ మూవీతో వస్తోన్న జయసుధ కుమారుడు..!
నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోకు వచ్చి సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు వాళ్లకు.. సంబంధించిన రైతులకు.. అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే వచ్చిన దర్శకులు విజయేంద్రప్రసాద్, జయసుధ , ఆర్ నారాయణ మూర్తి , రైటర్ చిన్ని కృష్ణ , దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్ గురించి దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా. ఇది ఒక కొత్త అటెంప్ట్. చదలవాడ శ్రీనివాసరావు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. ఆర్. నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అనే విలువలున్నాయి. ఈ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. జయసుధ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నిహార్ నటించడం చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా.. ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్లో నేను చాలా సినిమాల్లో నటించాను. చదలవాడ శ్రీనివాసరావుతో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సత్య కృష్ణ, ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
2025 సంక్రాంతి బరిలో నాగార్జున, చిరంజీవి
-
ది ఘోస్ట్‌పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్.. ఆ ఒక్కటే హైలెట్ అంటూ..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగార్జున కొన్ని యాక్షన్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కింగ్. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఆసక్తిగా ఉంటాయన్నారు నాగ్. క్లైమాక్స్‌లో వచ్చే చర్చ్ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందన్నారు కింగ్ నాగార్జున. అలాగే దర్శకుడు సైతం ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. -
శివార్లలో సినిమా సిటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1,500–2,000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున సినిమా షూ టింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారం భించవచ్చని సీఎం ప్రకటించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి–విస్తరణపై చర్చ జరిగింది. ‘తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోయి, థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లు కొనసాగించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగ్‌లు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి వరద బాధితుల సహాయార్థం విరాళాల చెక్కులను అందజేస్తున్న సినీనటులు చిరంజీవి, నాగార్జున, మై హోమ్స్ గ్రూప్ డైరెక్టర్ రామ్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్ సినిమా సిటీలో స్టూడియోలకు స్థలాలు.. ‘హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి–విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకొనే గుణం ఈ నగరానికి ఉంది. షూటింగులు సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1,500–2,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకొనేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్‌తోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. సీఎంకు ‘గ్రేటర్ వరద’ విరాళాలు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా మై హోమ్ గ్రూప్‌తోపాటు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విరాళాలు అందించారు. ‘మై హోం’తరఫున ఆ సంస్థ డైరెక్టర్ రామ్ రూ. 5 కోట్లు అందించగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ. 50 లక్షల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
నాగ్‌తో విలన్‌గా తలపడనున్న జగపతి
-
నాగ్‌ను మాసీగా చూపించేందుకు...
కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ సాధించి అనంతరం మెగా ఫోన్ చేతపట్టి వరుస సక్సెస్‌లు కొడుతున్న దర్శకుడు లారెన్స్. స్టార్ హీరోలను కూడా డైరెక్ట్ చేసిన లారెన్స్ ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న తమిళ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ డాన్సింగ్ స్టార్‌కు మంచి రికార్డే ఉంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కించిన మాస్, డాన్ సినిమాలు లారెన్స్ కెరీర్లో మంచి హిట్స్ గా నిలిచాయి. అందుకే మరోసారి టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు లారెన్స్. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఓ మాస్ సినిమా చేయాలనుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో లారెన్స్ ఆశలకు మరింత జోష్ వచ్చింది. రెండుసార్లు సక్సెస్ అయిన వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఆడియన్స్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే నాగ్ ఇమేజ్ కు తగ్గ ఓ యాక్షన్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు లారెన్స్. ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉండగా, లారెన్స్ కూడా తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో మాస్ మసాలా ఎంటర్ టైనర్ పట్టాలెక్కే చాన్స్ ఉంది. చాలా రోజులుగా క్లాస్ సినిమాలే చేస్తున్న నాగ్ ను వీలైనంత మాసీగా చూపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు లారెన్స్. 'రెబల్' డిజాస్టర్ కావటంతో కావటంతో తెలుగు తెరకు దూరమైన ఈ డాన్సింగ్ స్టార్ నాగ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటాలని భావిస్తున్నాడు.