కొరియోగ్రాఫర్గా సక్సెస్ సాధించి అనంతరం మెగా ఫోన్ చేతపట్టి వరుస సక్సెస్లు కొడుతున్న దర్శకుడు లారెన్స్. స్టార్ హీరోలను కూడా డైరెక్ట్ చేసిన లారెన్స్ ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న తమిళ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ డాన్సింగ్ స్టార్కు మంచి రికార్డే ఉంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కించిన మాస్, డాన్ సినిమాలు లారెన్స్ కెరీర్లో మంచి హిట్స్ గా నిలిచాయి.
అందుకే మరోసారి టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు లారెన్స్. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఓ మాస్ సినిమా చేయాలనుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో లారెన్స్ ఆశలకు మరింత జోష్ వచ్చింది. రెండుసార్లు సక్సెస్ అయిన వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఆడియన్స్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే నాగ్ ఇమేజ్ కు తగ్గ ఓ యాక్షన్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు లారెన్స్.
ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉండగా, లారెన్స్ కూడా తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో మాస్ మసాలా ఎంటర్ టైనర్ పట్టాలెక్కే చాన్స్ ఉంది. చాలా రోజులుగా క్లాస్ సినిమాలే చేస్తున్న నాగ్ ను వీలైనంత మాసీగా చూపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు లారెన్స్. 'రెబల్' డిజాస్టర్ కావటంతో కావటంతో తెలుగు తెరకు దూరమైన ఈ డాన్సింగ్ స్టార్ నాగ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటాలని భావిస్తున్నాడు.
నాగ్ను మాసీగా చూపించేందుకు...
Published Mon, Aug 31 2015 10:02 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM
Advertisement
Advertisement