Don
-
నీతూబాయి ఆట కట్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకుని తీరుతామని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.ఆమె పట్ల తాము ఎలాంటి మెతక వైఖరి అవలంభించడం లేదని, కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న నీతూబాయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖతో పాటు లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాయన్నారు. ఆమె అక్రమ కార్యకలాపాలపై కేసులు నమోదు చేశామని, గతంలో ఆమె పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయినా ఆమె వైఖరిలో మార్పురాలేదన్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా యధావిధిగా గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుండడంతో బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీస్ శాఖ ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసిందన్నారు. రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి, ఆమె కుటుంబసభ్యులు అక్రమంగా కూడబెట్టిన స్థిర, చర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. నీతూబాయ్ నుంచి రూ.15.17 లక్షలు, ఆమె కుటుంబ సభ్యులైన మధుబాయి రూ. 25.13 లక్షలు, గౌతమ్‌సింగ్ నుంచి రూ.91.21 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 86 లక్షల స్థిరాస్తులను జప్తు చేశామన్నారు. నీతూబాయిపై హిస్టరీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, గోల్కొండ, గచి్చబౌలి, మొయినాబాద్, గౌరారం, నల్లగొండ టూటౌన్లతోపాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ధూల్‌పేట్, నారాయణగూడలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెపై 25 కేసులు ఉన్నాయని, పోలీసులు 7 కేసులు నమోదు చేశారన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్ తరహాలో నానక్‌రాంగూడలోనూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం -
ధూల్‌పేట గంజాయి డాన్ అంగూర్‌బాయి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ఎక్సైజ్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అంగూర్ బాయి ఎట్టకేలకు గురువారం కార్వాన్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. ధూల్‌పేట్ గంజాయి డాన్‌గా గుర్తింపు పొందిన అంగూర్‌బాయిని కార్వాన్ ప్రాంతంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అమ్మకాల్లో రూ.కోట్లకు పడగలెత్తిన అంగూర్ బాయిపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మంగల్‌హట్ పోలీస్‌స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో అరెస్టు చేసేందుకు ఎక్సైజ్, పోలీసులు పలు మార్లు ప్రయతి్నంచినా ఆమె తప్పించుకు తిరుగుతోంది. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలిగా జైలుకు వెళ్లి వచ్చిన ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆమె కుటుంబ సభ్యులపై కూడా పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం. ధూల్‌పేట్‌లో గంజాయి హోల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అరితేరిన అంగూర్ బాయిని అపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా అరెస్టు చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు. అంగూర్‌బాయి అరెస్ట్‌తో ధూల్‌పేటలో ఎక్సైజ్ పోలీసులు భారీ విజయాన్ని నమోదు చేశారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న 'డాన్' దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సీబీ చక్రవర్తి వివాహబంధంలో అడుగుపెట్టాడు. హీరో శివ కార్తికేయన్‌కు 'డాన్' వంటి హిట్ సినిమా అందించి సౌత్ ఇండియాలో పాపులర్ డైరెక్టర్‌గా చక్రవర్తి గుర్తింపు తెచ్చుకున్నాడు. తను డైరెక్షన్ చేసిన మొదటి సినిమా 'డాన్'తో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్‌లో రికార్డ్ సెట్ చేశాడు. 2022లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇందులో శివకార్తికేయన్‌తో పాటు ప్రియాంక మోహన్, ఎస్.జె. సూర్య తదితరులు నటించారు.దర్శకుడు సీబీ చక్రవర్తి సెప్టెంబర్ 5న వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీ వర్షిణితో కలిసి ఏడడుగులు వేశాడు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. చెన్నై ఈరోడ్‌లోని ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 5న వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.దర్శకుడు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా సీబీ చక్రవర్తి పనిచేశాడు. తన మొదటి సినిమాతోనే టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా జరిగిన తన వివాహ వేడుకలో శివ కార్తికేయన్, అట్లీ పాల్గొన్నారు. సీబీ చక్రవర్తి చేతిలో ఒక బిగ్ సినిమా ఉంది. శివ కార్తికేయన్, రష్మిక మందన్న జోడీగా ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య కూడా నటించనున్నారు. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రానుంది. -
కరుడుగట్టిన స్క్రాప్ మాఫియా డాన్, ప్రియురాలి అరెస్ట్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్ ఝా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు.నోయిడా పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీంద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్ అయ్యారు.ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉంది. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. -
కొండపిలో తప్పిపోయిన ‘డాన్’..!
కొండపి(సింగరాయకొండ): ‘డాన్ తప్పిపోవడమేంటని అనుకుంటున్నారా..?’ ఈ డాన్ మీరనుకుంటున్న డాన్ కాదు.. ఐదేళ్ల వయసున్న డాన్ అనే బాలుడు గురువారం సాయంత్రం కొండపి మండల కేంద్రంలో తప్పిపోయాడు. సెంటర్లో ఒంటరిగా దిక్కులు చూస్తున్న బాలుడిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి చేరదీశారు. ఇల్లు, తలిదండ్రుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలుడు చెప్పిన విధంగా కొండపి ఊరంతా తిప్పారు. ఫలితం లేకపోవడంతో ఆ బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మహిళా కానిస్టేబుల్ భూదేవి బాలుడికి సపర్యలు చేసింది. ఇదిలా ఉండగా బాలుడు పోలీస్ స్టేషన్లో క్షేమంగా ఉన్నాడని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బాలుడి తల్లిదండ్రులు మరియమ్మ, రవి శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కుమారుడిని అక్కున చేర్చుకున్నారు. తమది పొదిలి మండల బుచ్చన్నపాలెం గ్రామమని, కొండపిలో సరుకులు కొనే క్రమంలో డాన్ తప్పిపోయాడని పోలీసులకు రవి వివరించాడు. కుమారుడిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్!
ఆమెది ఎంత అందమైన ముఖమో.. అంతే పదునైన ఆలోచనలు ఆమె సొంతం. అయితే ఆమె ఈ అందాన్ని, తెలివితేటలను నేర ప్రపంచం కోసం వినియోగించింది. డాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తరువాత నేర ప్రపంచంలోని ఇతర నేరస్తులతో కలివిడిగా తిరిగేవరకూ సాగింది. ఈ కథ రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరిది. ఆమెను జనం లేడీ డాన్ అని, రివాల్వర్ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్ స్టార్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు నేరుగా సంబంధాలున్నాయి. పండితుని ఇంట పుట్టి.. రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో అనురాధ చౌదరి జన్మించింది. తల్లి చనిపోవడంతో తండ్రే ఆమెను పెంచిపెద్ద చేశాడు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. కుమార్తెను పెద్ద చదువులు చదించాలని కలలుగనేవాడు. అనురాధ కూడా చిన్నతనం నుంచే చదువుపై దృష్టి నిలిపింది. రాజస్థాన్‌లోని ఒక యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసింది. అయితే కాలేజీ రోజుల్లో ఆమె దీపక్ మింజాతో ప్రేమలో పడింది. దీపక్‌తో ప్రేమ పెళ్లి దీపక్‌తో పెళ్లికి అనురాధ తండ్రి విముఖత వ్యక్తం చేశాడు. అయితే ఆమె తండ్రి మాట కాదని దీపక్‌ను వివాహం చేసుకుంది. కుటుంబంతో అనుబంధం తెంచుకుంది. అనురాధ, దీపక్‌లు కుటుంబ పోషణకు షేర్ ట్రేడింగ్ పని మొదలుపెట్టారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు చుట్టుపక్కల వారిని ప్రోత్సహించేవారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగానే సాగింది. ఆ తరువాత వ్యాపారంలో సమస్యలు తలెత్తడంతో అనురాధ జీవితమే మారిపోయింది. డబ్బు సంపాదనకు అనురాధ తప్పుడు మార్గాలను ఆశ్రయించడం మొదలు పెట్టింది. అనురాధకు ఆనంద్‌పాల్ ఫిదా ఆ సమయంలో రాజస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ ప్రభావం అధికంగా ఉండేది. అనురాధ.. ఆనంద్‌పాల్‌ను కలుసుకుంది. అమె అందమైనది, తెలివైనది కావడంతో ఆనంద్‌పాల్ ఆమెతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు మొదలైన నేరాలలో ఆనంద్‌పాల్ పేరు ప్రముఖంగా వినిపించేది. అనురాధ కూడా ఆనంద్ పాల్ గ్యాంగ్ సభ్యురాలిగా మారింది. భర్త దీపక్‌కు దూరం అయ్యింది. ఆనంద్‌పాల్‌ను వివాహం చేసుకుందని చెబుతారు. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! ఆనంద్‌పాల్‌కు ఆంగ్లం నేర్పిన అనురాధ ఆనంద్‌పాల్ అనురాధకు రివాల్వర్ వినియోగించడంతో పాటు వివిధ నేరాలలో శిక్షణ అందించాడు. అదేసమయంలో అనురాధ ఆనంద్‌పాల్‌కు ఆంగ్ల భాషలో సంబాషించడాన్ని నేర్పించింది. ఆనంద్‌పాల్ అనురాధ అడుగులకు మడుగులొత్తేవాడని అంటారు. 2017లో ఆనంద్‌పాల్ పోలీసులు జరిపిన ఒక ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ సమయంలో అనురాధ రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చి, ఆనంద్‌పాల్ గ్యాంగ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. కాలా జఠెడిపై కన్ను వేసి.. అనురాధ తన గ్యాంగ్ ప్రభావాన్ని మరింతగా పెంచుకునేందుకు లారెన్స్ బిష్ణోయితో దోస్తీ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లో మారణాయుధాల అక్రమ సరఫరాను అనురాధ గ్యాంగ్ పర్యవేక్షించేది. బిష్టోయి గ్యాంగ్‌తో జతకట్టిన అనురాధ కొంతకాలానికి కాలా జఠెడితో స్నేహం ప్రారంభించింది. కాలా జఠెడి.. బిష్ణోయి గ్యాంగ్ కోసం పనిచేసేవాడు. పాక్ నుంచి ఆయుధాల సరఫరాను జఠెడీ చూసుకునేవాడు. అనురాధ, కాలా జఠెడీ కలసివుండసాగారు. వారు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని కొందరు చెబుతుంటారు. తరువాత వీరిద్దరూ మారు పేర్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు. అయితే 2021లో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: ‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య! -
మరోసారి డాన్‌గా కమల్ హాసన్ సోదరుడు.. 93 ఏళ్ల వయసులోనూ అదే జోష్
నటుడు కమల్ హాసన్ సోదరుడు నటి సుహాసిని తండ్రి అయిన చారుహాసన్ ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఈమధ్య దాదా 87 అనే చిత్రంలో డాన్‌గా ప్రధాన పాత్ర పోషించి అందరినీ విస్మయపరిచారు. చారు హాసన్ వయసు ప్రస్తుతం 93 ఏళ్లు ఈ వయసులోనూ ఆయన మరోసారి డాన్‌గా తెరపై కనిపించబోతున్నారు. ఇంతకుముందు దాదా 87, పౌడర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన విజయ్ శ్రీ.జీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం హర. కోయంబత్తూర్ ఎస్పీ మోహన్ రాజ్, జీ మీడియా జయ శ్రీ విజయ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. విలన్ పాత్రల్లో సురేష్ మీనన్, నటి వనిత విజయ్ కుమార్ నటించగా, నటి కుష్బూ, యోగిబాబు, మొట్టై రాజేంద్రన్, సింగం పులి, దీప, మైమ్ గోపి, శ్యామ్స్, కౌశిక్ ,అనిత్రా నాయర్, సంతోష్ ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పాఠశాలల్లో చదువుకుంటున్నప్పటి నుంచే బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై అవగాహన కలిగించాలనే కాన్సెప్ట్‌తో దీన్ని నిర్మించామన్నారు. ఇకపోతే నటుడు చారుహాసన్ ఈ చిత్రంలో ఒక మంచి డాన్ గా నటించినట్లు చెప్పారు. ఆయన ఒక సామాజిక బాధ్యత కలిగిన డాన్ పాత్రను పోషించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
ఈ కంపెనీలో ఒక రోజు
వీధి రౌడీ నుంచి మాఫియా డాన్ వరకు దావూద్ ఇబ్రహీం నేర పరిణామ క్రమాన్ని దగ్గరి నుంచి చూసింది జర్నలిస్ట్ షీలాభట్. ఆమె దావూద్‌ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేసింది. 1970లో...‘చిత్రలేఖ’ మ్యాగజైన్లో మాఫియా డాన్ కరీమ్లాలాతో షీలాభట్ ఉన్న ఫోటోను చూసి ఆమెకు కాల్ చేశాడు దావూద్. అప్పుడు దావూద్ ‘జస్ట్ ఏ క్రిమినల్’ మాత్రమే. ‘మీరు నాకు ఒక సహాయం చేయాలి. ముంబైలోని గవర్నమెంట్ రిమాండ్ హోమ్‌లో ఉన్న అమ్మాయిలను కరీమ్లాలా మనుషులు వేధిస్తున్నారు. మీరు వాళ్ల దుర్మార్గాల గురించి పత్రికల్లో రాయాలి’ అని షీలాను అడిగాడు దావూద్. ‘దావూద్ అంటే భయం కంటే ప్రయాణ ఖర్చుల గురించి బాధే నాలో ఎక్కువగా ఉండేది’ అని దుబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని నవ్వుతూ చెప్పింది షీలా. ఒకసారి దావూద్‌ను ఇంటర్య్వూ చేయడం కోసం దుబాయ్‌కు వెళ్లింది. ‘లెట్స్ ఈట్’ అంటున్నాడే తప్ప ఇంటర్య్వూకు మాత్రం ‘నో’ అంటున్నాడు దావూద్. మూడురోజుల తరువాత మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక మర్డర్ గురించి మాట్లాడుతూ ‘వాడిని నేను చంపి ఉండకపోతే, వాడు నన్ను కచ్చితంగా చంపేవాడు. షీలాజీ... మీరే చెప్పండీ. నేను చేసింది ఏమైనా తప్పంటారా?’ అని అమాయకంగా ముఖం పెట్టాడు దావూద్! తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలెన్నో చెప్పింది షీలాభట్. -
12 ఏళ్లుగా డాన్ 3 గురించి చర్చ.. ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చిన నిర్మాత
షారుక్ ఖాన్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘డాన్’ (2006) ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బంపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే షారుక్ హీరోగా వచ్చిన ‘డాన్ 2’ (2011) కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ‘డాన్ 3’కి సన్నాహాలు జరుగుతున్నాయి. గడిచిన పన్నెండేళ్లల్లో ‘డాన్ 3’ గురించి అడపా దడపా చర్చలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘డాన్ 3’ గురించి చిత్రనిర్మాత రితేష్ అద్వానీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కథ సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక షూటింగ్ ప్లాన్ చెబుతామనీ పేర్కొన్నారు రితేష్. -
క్రిమినల్ కథా చిత్రమ్.. అత్యంత కరడుగట్టిన నేరగాడు అతీక్ అహ్మద్
మాఫియా డాన్, గ్యాంగ్ లీడర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్, మాఫియా–బాహుబలి, దబాంగ్, పొలిటి కల్ లీడర్.. ఇవన్నీ ఒకే వ్యక్తికి పర్యాయపదాలు. ఆ ఒక్కడే అతీక్ అహ్మద్. ఉత్తరప్రదేశ్‌లో అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అతడి తండ్రి అతీక్ అహ్మద్ పేరు మళ్లీ ప్రముఖంగా చర్చల్లోకి వచ్చింది. నిరుపేద టాంగావాలా కుమారుడైన అతీక్ అహ్మద్ రౌడీయిజంలో, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. రూ.వందల కోట్ల విలువైన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మించిన అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)ను అతీక్ అహ్మద్ సొంత జాగీరుగా మార్చేసుకొని, సమాంతర పాలన సాగించాడంటే అతడి హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వందకుపైగా కేసులు నమోదైనప్పటికీ.. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు మినహా ఏ కేసులోనూ అతీక్‌కు శిక్ష పడలేదు. వ్యవస్థ మొత్తం అతడికి దాసోహమైందని, నిస్సిగ్గుగా ఊడిగం చేసిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నేరాల నుంచి వ్యాపారాలు, వ్యాపారాల నుంచి రాజకీయాలు.. ఇలా సాగింది అతీక్ ప్రస్థానం. నేరాలను, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, శిక్షల నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకున్నాడు. 18 ఏళ్ల వయసులో తొలి ఎఫ్ఐఆర్ ► అతీక్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు. టాంగా నడిపే అతడి తండ్రి హజీ ఫిరోజ్ నేరస్వభావం ఉన్నవాడే. అతీక్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో నేరమార్గం ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లతో చెలరేగిపోయాడు. 1983లో 18 ఏళ్ల వయసున్నప్పుడు అతీక్‌పై మొదటి ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అతడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు విసిరిన వల నుంచి చాలాసార్లు తప్పించుకున్నాడు. అతీక్‌పై నమోదైన కేసులను విచారించాలంటే న్యాయమూర్తులు వెనుకంజ వేసేవారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన 10 మంది జడ్జీ్జలు తమంతట తామే ఈ కేసుల విచారణ నుంచి తప్పుకున్నారు. అతీక్ చంపేస్తాడన్న భయమే ఇందుకు కారణం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక కూడా ప్రత్యర్థులను కిడ్నాప్ చేసి, తానున్న జైలుకు రప్పించి, తీవ్రంగా హింసించాడు. అతడిని ఉత్తరప్రదేశ్ జైళ్లలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉంచాలని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. కుటుంబం.. నేరమయం ► ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతీక్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్లో హతం కావడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. కరడుగట్టిన నేరగాడైన అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు సైతం నేరాలబాట పట్టినవారే కావడం గమనార్హం. కొందరు ఇప్పటికే వేర్వేరు కేసుల్లో జైలుపాలయ్యారు. అతడి భార్య మాత్రం పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ► నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ కన్ను 1980వ దశకంలో రాజకీయాలపై పడింది. 1989లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. మతం కార్డు వాడుకున్నాడు. తన ప్రత్యర్థి చాంద్బాబాను హత్య చేశాడు. సులువుగా విజయం సాధించాడు. తొలిసారి ఎమ్మెల్యే హోదా సంపాదించాడు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1991, 1993లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌తో, 2002 ఆప్నా దళ్ టికెట్‌తో గెలిచాడు. 2002లో ఆప్నా దళ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడయ్యాడు. హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశాడు. 2004లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున ఫూల్పూర్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. పార్లమెంట్లో అడుగుపెట్టాడు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా నేరాలు ఆపలేదు. మరింత రాటుదేలాడు. బినామీల పేరిట కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇతర కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేసేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాలకు అతీక్ నేరసామ్రాజ్యం విస్తరించింది. అచ్ఛంగా సినిమాల్లో చూపించే డాన్ల తరహాలోనే అతడి వ్యవహార శైలి, ప్రవర్తన ఉండేవి. తరచుగా గుర్రంపై వీధుల్లో తిరిగేవాడు. కొన్నిసార్లు ఖరీదైన కార్ల కాన్వాయ్ వెంటరాగా పాదయాత్ర చేస్తుండేవాడు. రాజుపాల్ హత్య కేసు ► 2005 జనవరి 25న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎమ్మెల్యే రాజుపాల్ హత్యతో అతీక్ పతనం ప్రారంభమైంది. ఈ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశాడు. కానీ, ఓటమే ఎదురయ్యింది. 2004లో ఎంపీగా గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఉప ఎన్నికల్లో తన సోదరుడు అజీమ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించుకున్నాడు. ఈ స్థానంలో నేరచరిత్ర ఉన్న రాజుపాల్కు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో అజీమ్ ఓడిపోయాడు. రాజుపాల్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో అతీక్, అజీమ్ నిందితులు. రాజుపాల్ హత్యతో మళ్లీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై అజీమ్ గెలిచాడు. అతీక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయాడు. అసద్ అహ్మద్ ► ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో అసద్ అహ్మద్ నిందితుడు. చాలా రోజులు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. ► అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ► గురువారం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు గులామ్తోపాటు మరణించాడు. ► అతీక్ అహ్మద్ మరో ఇద్దరు కుమారులైన అజాన్, అబాన్ మైనర్లు. వారు ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ హోంలో ఉన్నారు. అతీక్ అహ్మద్ ► గత 43 ఏళ్లుగా పోలీసు రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ► ఉమేశ్‌పాల్ అపహరణ కేసులో అతీక్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ► ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. ► అతీక్ అహ్మద్ 1996లో షాయిస్తా పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు. ► వారికి ఐదుగురు కుమారులు.. అలీ అహ్మద్, ఉమర్ అహ్మద్, అసద్ అహ్మద్, అజాన్ అహ్మద్, అబాన్ అహ్మద్ ఉన్నారు. ► పాకిస్తాన్ ఉగ్రవాదులతో, అక్కడి నిఘా సంస్థ ఐఎస్ఐతో అతీక్ అహ్మద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. అష్రాఫ్ అలియాస్ అజీమ్ అహ్మద్ ► అతీక్ అహ్మద్ సోదరుడే అష్రాఫ్/అజీమ్ అహ్మద్. ► ఇతడిపై మొత్తం 52 కేసులు ఉన్నాయి. ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ► 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ఇతడిని ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషిగా తేల్చింది. ► యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. షాయిస్తా పర్వీన్ ► ఉమేశ్ పాల్ హత్య వ్యవహారంలో అతీక్ అహ్మద్, ఆష్రాఫ్ అహ్మద్‌తోపాటు షాయిస్తా పర్వీన్‌పై కేసు నమోదయ్యింది. ► పరారీలో ఉన్న పర్వీన్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ► ఆమె ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో రివార్డు మొత్తాన్ని రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచారు. అలీ అహ్మద్ ► బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడిన కేసులో 2021లో అలీ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ► ఉమేశ్‌పాల్ హత్య కేసులోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది. ► అలీ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది మార్చి 3న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు లక్నో జైలులో ఉన్నాడు. ► అలీ అహ్మద్ లాంటి నేరగాళ్లు బయట ఉంటే కేవలం సాక్షులకే కాదు, సమాజానికి సైతం ముప్పేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉమర్ అహ్మద్ ► లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ కిడ్నాప్, దాడి కేసులో అతీక్ అహ్మద్‌తోపాటు ఉమర్ అహ్మద్‌పై 2018 ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ► అదే కేసులో ఉమర్ అహ్మద్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలులో ఉన్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు
టెక్నాలజీ.. ఆక్సిజన్ తర్వాత మనిషికి అవసరంగా మారింది. అయితే మనిషి తన కంఫర్ట్ లెవల్స్ పెరిగే కొద్దీ.. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపత్కాలంలో మనుషుల ప్రాణాల్ని కాపాడడమే కాదు.. అవసరమైతే సంఘవిద్రోహ శక్తుల వేటలోనూ సాయం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం. ఇందుకు ఉదాహరణే.. ఇటలీలో జరిగిన ఓ ఘటన. పోలీసుల్ని సైతం ముప్పుతిప్పలు పెట్టిన కరడు గట్టిన నేరస్తుణ్ని 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పట్టించింది. ఇటలీ రాజధాని రోమ్‌లో 'స్టిడా' అనే సిసిలియన్ మాఫియా ఉంది. 2002 -03 మధ్య కాలంలో ఈ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైలు శిక్షను అనుభవిస్తున్న మాఫియా డాన్ గియోఅచినో గామినో (61) రోమ్ రెబిబ్బియా జైలు నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నుంచి తప్పించుకుని మారు పేర్లు.. రకరకాల వేషాలతో కాలం గడిపాడు. గామినో పరారై 20ఏళ్లు గడిచినా.. ఇటలీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా టెక్నాలజీని వాడాలనే బుద్ధి పోలీసులకు కలిగింది. ఇందుకోసం ఫోటోగ్రామ్ సాయం తీసుకుని..గామినో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫోటోగ్రామ్ ఫోటో సాయంతో గూగుల్ మ్యాప్‌ను అనుసంధానించారు. దేశవిదేశాల్ని జల్లెడపట్టారు. చివరికి మాడ్రిడ్(స్పెయిన్) గల్లీలపై నిఘా వేయగా.. గాలాపగర్ అనే ప్రాంతంలో ఓ పండ్ల దుకాణం ముందు ఉన్న గామినోను గూగుల్ మ్యాప్ గుర్తించింది. వెంటనే ఇటలీ పోలీసులను అలర్ట్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గామినోను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇటాలియన్ యాంటీ-మాఫియా పోలీస్ యూనిట్ (డీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ నికోలా అల్టీరో హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలపాటు ముప్పుతిప్పలు పెట్టిన ఓ మాఫియా డాన్‌ను గూగుల్ మ్యాప్ పట్టించడంపై సోషల్ మీడియాలోనూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు ప్రస్తుతం స్పెయిన్ కస్టడీలో ఉన్నాడని, ఫిబ్రవరి చివరి నాటికి అతన్ని ఇటలీకి తరలిస్తారని సమాచారం. చదవండి: మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది -
డాన్.. డబుల్ జీరో నెంబర్.. దీని వెనుక పెద్ద కథే ఉంది..
Scrap Don: ఆరోజు మార్నింగ్ వాక్‌కి వెళ్ళినవారికి రైల్వే స్క్రాప్ యార్డ్ సమీపంలో ఓ శవం కనిపించింది. వార్త అందగానే విశాఖపట్టణం 3–టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. హతుడి వయసు 35 ఏళ్ళుంటుంది. తెల్ల షర్ట్, బ్లూ ప్యాంటులో వున్నాడు. శరీరం పైన 5 లోతైన కత్తిపోట్లు ఉన్నాయి. రక్తం మడుగుకట్టింది. హతుడి పేరు గోవిందరావు అనీ, సీతమ్మధారకు చెందిన ఓ రైల్వే స్క్రాప్ కాంట్రాక్టరనీ తెలిసింది. పోలీసులు హత్యాప్రదేశాన్ని కార్డనాఫ్ చేసి తమ తతంగం ఆరంభించారు. శవాన్ని పరీక్షించిన డాక్టర్ ‘రిగర్ మార్టిస్’ని బట్టి, హత్య జరిగి సుమారు పది గంటలయినా కావచ్చునని చెప్పాడు. గాయాల లోతును బట్టి హత్యకు ఉపయోగించిన కత్తి పొడవు ఆరేడు అంగుళాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు నిపుణులు. స్నిఫర్ డాగ్ రప్పించబడింది. అది నేలను వాసన చూస్తూ అక్కడికి సుమారు రెండువందల మీటర్ల దూరంలోని రైల్వే స్క్రాప్ యార్డ్ కాంపౌండు వెనుక భాగంలో వున్న చిన్నబండల వద్దకు వెళ్ళి ఆగింది. అక్కడ రెండు ఖాళీ బీరు బాటిల్స్, తినుబండారాలను తినేసి పడేసిన కాగితపు పొట్లాలు, సిగరెట్ పీకలు, బూట్ల ఆనవాళ్ళున్నాయి. చెప్పుల ఆనవాళ్ళు కూడా కనిపించాయి. ఓ పాత తువాలు పీలిక పడివుంది. పరిసరాలను గాలించిన పోలీసులకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న తుప్పల్లో పొడవాటి కత్తి ఒకటి దొరికింది. దానిపైన రక్తం ఎండిపోయి వుంది. హత్యాయుధం అదేనని గ్రహించిన పోలీసులకు– మర్డర్ చేశాక హంతకులు ఆ బండల దగ్గర కూర్చుని డ్రింక్ చేసివుంటారని అర్థమయింది. దుండగులు కూర్చున్న స్థలాన్ని, కత్తిని, సీసాలను, గుడ్డపీలికను వాసన చూసిన శునకం ఓ క్షణంపాటు దిక్కులు చూసి ఓ దిశగా పరుగుతీసింది. కొంతదూరం వెళ్ళాక ఓ పాక వద్ద ఆగింది. అక్కడ చింకిచాప పైన పడుకుని ఉన్నాడు ఓ బిచ్చగాడు. ఓ మూలన ఓ గుడ్డసంచి, అందులో కొన్ని పాతబట్టలు వున్నాయి. పక్కనే చిరిగిన ఓ పాత తుండు కనిపించింది. తమకు దొరికిన గుడ్డపీలిక దానినుంచే చింపబడ్డట్టు గుర్తించారు పోలీసులు. శునకం దాని దగ్గరకు వెళ్ళి భీకరంగా మొరగడంతో తుళ్ళిపడి లేచాడు వాడు. కుక్కను, పోలీసులను చూసి భయంతో ఒణికిపోయాడు. రైల్వే స్క్రాప్ యార్డ్ దగ్గర జరిగిన హత్య గురించి గద్దించి అడిగితే, తనకేమీ తెలియదని మొత్తుకున్నాడు. రెండు తగిలించి, వాడి తువాలు పీలిక అక్కడికి ఎందుకు వచ్చిందని గద్దించడంతో జరిగిందేమిటో ఏడుస్తూ చెప్పాడు. గతరాత్రి వాడు బిచ్చమెత్తుకుని అడ్డదారిలో తన పాకకు తిరిగివస్తూంటే, రైల్వే స్క్రాప్ యార్డ్ కాంపౌండ్ వెనుక ఇద్దరు వ్యక్తులు కూర్చుని హిందీలో మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి తనకూ కాస్త డ్రింక్ పోయమని అడిగాడు వాడు. కసిరారు వాళ్ళు. వాడు కదలకుండా బతిమాలుతుంటే.. ‘అరె, చల్ బే!’ అంటూ తిట్టారు. అయినా ఆశ చావక ఇంకా అక్కడే నిలుచునివున్నాడు వాడు. దాంతో వాళ్ళలో ఒకడు కోపంతో లేచి వాడి భుజమ్మీది తుండుగుడ్డను పట్టుకుని లాగి ముందుకు తోసేశాడు. అది పాతది కావడంతో చిరిగి కొంతముక్క కింద పడిపోయింది. వాడు భయంతో గబగబా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. పాకకు వచ్చి అన్నం తిని పడుకున్నాడు. హత్య సంగతి ఎరుగడు. వాళ్ళ ఆకారాలు, వేషభాషలు చూస్తే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గూండాల్లా ఉన్నారనీ చెప్పాడు బిచ్చగాడు. విచారణ ముగిసేంతవరకూ వాణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవిందరావు శవానికి ‘పోస్ట్‌మార్టమ్’ చేసిన సర్జన్, హత్యా సమయాన్ని రాత్రి 9 గంటలకు కొంచెం అటు ఇటులో తేల్చాడు. పోలీసులు టీమ్స్‌గా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. రాత్రి కానీ, ఉదయం కానీ ఎవరైనా పాసింగ్ ట్రక్స్‌లో ఎస్కేప్ అయినవారున్నారేమోనని ఆరా తీస్తే చిన్నవాల్తేరు లోని ఓ లాడ్జ్‌లో దొరికారు ఇద్దరు రౌడీలు. హత్యకు ముందురోజున వాళ్ళు బిహార్ నుంచి వచ్చి ఆ లాడ్జ్‌లో దిగినట్లు తెలిసింది. లాకప్‌లో పడేసి డ్రెస్సింగ్ డౌన్ ఇచ్చేసరికి గోవిందరావును చంపింది తామేనని ఒప్పుకున్నారు. ఆ హత్య వెనుకున్న మోటివ్ కోసం ప్రశ్నించిన పోలీసులను వాళ్ళు బైటపెట్టిన విషయాలు షాక్‌కి గురిచేశాయి. రైల్వేల్లో ఏడాదికి జనరేట్ అయ్యే 20 లక్షల టన్నుల స్క్రాప్‌లోని ఇనుము, స్టీల్, అల్యూమినియం, ఇత్తడి, రాగి విలువ ఇంచుమించు 5 వేల కోట్లుంటుంది. దాన్ని పబ్లిక్ వేలం ద్వారా అమ్మేస్తుంటారు. స్క్రాప్ కాంట్రాక్టర్స్ ఆ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. అది మిక్కిలి లాభసాటి బిజినెస్ కావడమే అందుకు కారణం. అయితే, ఆ వేలంపాటను ఓ వ్యక్తి నియంత్రించడం విశేషం! అతని పేరు భానోజీ. స్క్రాప్ మాఫియా డాన్. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అసన్సోల్లతో ఆరంభమైన అతని ఆపరేషన్స్ అనతికాలంలోనే తూర్పు, దక్షిణ–తూర్పు కోస్తాలకు పాకిపోయాయి. ‘ఎక్స్టార్షన్’, ‘మర్డర్ త్రెట్’ భానోజీ ఆయుధాలు. ఏ జోన్లో ఎవరు, ఎప్పుడు వేలంపాటలో పాల్గొనాలో అతను నిర్ణయిస్తాడు. అందుకు ఆ కాంట్రాక్టర్ అతను కోరిన సొమ్మును చెల్లించాలి. అంతేకాదు స్క్రాప్‌ని రైల్వే యార్డ్ నుండి తరలించేటప్పుడు ఒక టన్నుకు వేయి రూపాయల చొప్పున ‘గూండా టాక్స్’ కూడా వసూలు చేస్తుంటారు భానోజీ మనుషులు. ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కాంట్రాక్టర్‌కి భూమి మీద నూకలు చెల్లినట్టే! ఆ సంగతులన్నీ తెలిసినా, తెలియనట్టే వుంటుంది రైల్వే శాఖ. మునుపు స్క్రాప్ కాంట్రాక్టర్స్ కొందరు ‘సిండికేట్’గా ఏర్పడి వేలాన్ని నియంత్రించేవారు. భానోజీ రంగప్రవేశం చేశాక సీన్ పూర్తిగా మారిపోయింది. అతను చెప్పిందే శాసనం. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా చంపేయసాగాడతను. అందువల్ల ఆయా రాష్ట్రాల్లోని స్క్రాప్ కాంట్రాక్టర్స్ అంతా కలసి ఓ అసోసియేషన్‌గా ఏర్పడి భానోజీతో ఒప్పందానికి వచ్చారు. నెలనెలా కొంత సొమ్ము అసోసియేషన్ తరపున మామూళ్ళు సమర్పించుకుంటే వేలంపాటలో పాల్గొనేందుకు అతను వంతులవారీగా కాంట్రాక్టర్లను ఎంపిక చేసేట్టు.. ఆ కాంట్రాక్టర్ అతను కోరిన సొమ్మును చెల్లించేటట్టు ఒడంబడిక జరిగింది. దాన్ని ఉల్లంఘించిన వారు హత్య చేయబడతారు. చిత్రమేమిటంటే అతనెవరో, ఎలా వుంటాడో, ఎక్కడ వుంటాడో ఎవరికీ తెలియదు. అతని అసలు పేరు కూడా తెలియదు. కాంట్రాక్టర్స్‌కి అతని నుండి ఫోన్ వస్తుంది. వారి సెల్‌ఫోన్ స్క్రీన్ మీద అతని మొబైల్ నంబర్ కానీ, పేరు కానీ కనపడవు. కేవలం ‘రెండు సున్నాలు (00)’ ప్రత్యక్షమవుతాయి. అందువల్ల అతన్ని ‘డబుల్ జీరో’గా వ్యవహరిస్తుంటారంతా. మాఫియా లీడర్‌కి లొంగిపోయినందుకు అసోసియేషన్‌ని తప్పుపడుతూ, భానోజీ డిక్టాట్స్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు కొందరు యువ కాంట్రాక్టర్స్. పర్యవసానంగా వారు హత్యకు గురవసాగారు. వారిలో విశాఖపట్టణానికి చెందిన గోవిందరావు ఒకడు. ఆ ప్యాటర్న్‌లోనే ఇతర రాష్ట్రాలతో పాటు హౌరా, సీల్దాల్లోనూ జరగడంతో బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సి.ఐ.డి. నుండి ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. అది డాన్ గురించిన సమాచారాన్ని సేకరించడంలో కొంతవరకు విజయం సాధించింది. భానోజీ బిహార్‌కి చెందినవాడు. నేపాల్‌ని స్థావరంగా చేసుకుని రైల్వే స్క్రాప్ మాఫియాని నడుపుతున్నాడు. అతనికి కొందరు రాజకీయనేతల అండదండలే కాక, పోలీసువర్గాల్లోనూ అతని మద్దతుదారులున్నట్టు అనుమానం. అతని పాత ఫొటోగ్రాఫ్‌ని ఎలాగో సంపాదించగలిగారు. ఓసారి బొకారో స్టీల్ సిటీకి చెందిన ఓ యువ కాంట్రాక్టర్ అసోసియేషన్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ భానోజీని ధిక్కరించే ప్రయత్నం చేశాడు. వేలంపాటలో పాల్గొనబోతున్నట్టు, చేతనైతే తనను ఆపమనీ స్క్రాప్ డాన్‌కి సవాల్ విసిరాడు. భానోజీకి విషయం తెలియడంతో, ఆ కాంట్రాక్టర్‌కి ఫోన్‌చేసి వేలంపాట సమయంలోనే అతన్ని స్వయంగా పబ్లిక్‌లో చంపుతానని బెదిరించాడు. ఆ సంగతి తెలిసిన పోలీసులు స్క్రాప్ డాన్ కోసం వల పన్నారు. ఆ యువకాంట్రాక్టర్ ధైర్యంగా ఆ వేలంపాటలో పాల్గొన్నాడు. రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులకుతోడు ప్లెయిన్ క్లోత్స్ పోలీస్‌మెన్ కూడా అచ్చటి జనంలో కలసిపోయి ఉన్నారు డాన్ కోసం పరికిస్తూ. వేలంపాట ముమ్మరంగా సాగుతూన్న సమయంలో ఆ యువకాంట్రాక్టర్ పోలీసుల సాక్షిగా పబ్లిక్‌గా పిస్టల్‌తో కాల్చి చంపబడ్డాడు! ఆ తరువాత విచారణలో తెలిసిందేమిటంటే భానోజీ పోలీస్ యూనిఫామ్‌లో వచ్చి ఆ మర్డర్ చేసి మాయమయ్యాడని! ఆ సంఘటనతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సంబంధిత రాష్ట్రాలకు చెందిన ఉన్నత పోలీసు అధికారులు కోల్‌కతాలో అత్యవసర సమావేశమయ్యారు. ∙∙ నేపాల్ రాజధాని ఖట్మండూలోని పార్టీ యానిమల్స్ ఫేవరేట్ ఏరియా– లజీంపేట్.. రాత్రి 9 గంటలు అవుతోంది. ఓ అందమైన యువతి ఆ వీధిలో పరుగెడుతోంది. పోలీసులు ఆమెను తరుముతున్నారు. సందుగొందులు తిరుగుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మెయిన్ రోడ్డును చేరుకున్న ఆ యువతి వేగంగా వస్తూన్న ఓ కారుకు అడ్డుపడింది. సడన్ బ్రేక్‌తో ఆగింది కారు. కంగారులో కిందపడిపోయిందామె. డ్రైవ్ చేస్తూన్న నడివయస్కుడు దిగి వచ్చాడు. అప్పటికే కంగారుగా పైకి లేచి, మోచేతికి తగిలిన గాయాన్ని చూసుకుంటోంది. నేపాలీస్ భాషలో కోపంగా అరిచాడతను.‘పోలీసులు తరుముకొస్తున్నారు’ అంటూ మళ్ళీ పరుగెత్తబోయిందామె. సందుమలుపులో ప్రత్యక్షమైన పోలీసుల్ని చూసి, ‘త్వరగా కారెక్కు’ అన్నాడు. మారు యోచన చేయకుండా ఎక్కేసిందామె. కొంతసేపటికి ఓ విల్లా వద్ద ఆగింది కారు. ఆమె దిగి వెళ్ళిపోతానన్నా వినకుండా లోపలికి తీసుకువెళ్ళాడతను. ‘ఇప్పుడు చెప్పు, పోలీసులు నిన్ను ఎందుకు తరుముతున్నారు? ఏం నేరం చేశావ్?’ అనడిగాడు. ఆమె సంశయిస్తూంటే, ‘నిజం చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అప్పగిస్తాను’ అని బెదిరించాడు. ఆ యువతి చెబుతూంటే ఆశ్చర్యంతో వింటూండిపోయాడతను. ఆమె పేరు పారెల్. ఓ పిక్ పాకెట్. రెండురోజుల కిందట అరబ్ షేక్ ఒకడు ఖట్మండూ వచ్చాడు. బత్తీస్ పుటలి రోడ్‌లోని ద్వారికా హోటల్లో బసచేశాడు. అతని వద్ద కోటిరూపాయల విలువచేసే వజ్రం ఒకటి ఉందనీ, దాన్ని అమ్మడానికే నేపాల్ వచ్చాడనీ తెలిసింది. ఆ యువతి బాయ్ ఫ్రెండ్ బైజూ కూడా పిక్ పాకెటే. అతని ప్రోద్బలంతో ఆ వజ్రాన్ని దొంగిలించడానికి సిద్ధపడ్డారిద్దరూ. ఏదో మిషతో ఆ రోజు రాత్రి ద్వారికా హోటల్‌కి వెళ్ళి అరబ్ షేక్‌ని కలవడానికి ప్రయత్నించారు. అతనికేం అనుమానం వచ్చిందో పోలీసుల్ని పిలిపించాడు. ఆ జంట పారిపోజూసింది. బైజూ దొరికిపోయాడు. ఆమె ఎలాగో తప్పించుకుంది. అంతా విని ‘వజ్రం గురించి నువ్వు చెబుతున్నది నిజమేనా?’ అనడిగాడు. నిజమే అందామె. ‘ఈరాత్రికి నువ్వు బైటకు వెళ్ళడం మంచిదికాదు. తెల్లవారాక ఆలోచిద్దాం’ అన్నాడు. తరువాత ఎవరికో ఫోన్ చేసి, కొద్ది నిముషాలు మాట్లాడాడు. మర్నాడు అతను 35 ఏళ్ళ వ్యక్తిని కలిశాడు. ‘భాయ్! రాత్రి నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను. ఆమె చెప్పిందంతా నిజమేనని తేలింది. నయానో భయానో ఆమెను ఒప్పించి ఆ షేక్ మీద ప్రయోగిద్దాం. వీలు చూసుకుని వజ్రాన్ని కైవసం చేసుకుందాం’ అన్నాడు. ∙∙ కాఠ్మాండూలోని ‘ద ద్వారికా హోటల్’ అంతర్జాతీయ అతిథుల తొలి ఛాయిస్ అది. ఆ రాత్రి హోటల్ డా¯Œ ్స ఫ్లోర్లో పారెల్ అందాన్ని తిలకించిన అరబ్ షేక్ ఫ్లాట్ అయిపోయాడు. ఆమె వద్దకు వెళ్ళి ‘ఈ రాత్రి నాతో ఉంటే నీపైన దీనార్ల వర్షం కురిపిస్తాను’ అన్నాడు. అరగంట తరువాత ఇద్దరూ కలసి షేక్ ఉంటున్న స్వీట్‌కి వెళ్ళారు. ఇద్దరికీ షేకే స్వయంగా డ్రింక్స్ కలిపాడు. అతను దుస్తులు మార్చుకుంటూంటే చాటుగా అతని డ్రింక్‌లో ఏదో పొడిని కలిపిందామె. అతను వచ్చాక ‘ఛీర్స్’ చెప్పుకుని డ్రింక్ చేయనారంభించారిద్దరూ. ఐదు నిముషాల తరువాత ఏదో మత్తు ఆవహించడంతో సోఫాలో వెనక్కి వాలిపోయాడు షేక్. పారెల్ అతన్ని కుదిపిచూసి, సెల్లో ఎవరికో ఫోన్ చేసింది. రెండు నిముషాల్లో ‘భాయ్’, అతని అనుచరుడూ ప్రవేశించారు. షేక్ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి, ‘వెల్ డన్!’ అంటూ పారెల్ని ప్రశంసించి, వజ్రంకోసం ఎడ్జాయినింగ్ రూమ్‌లోని ఐరన్ సేఫ్ తెరవడానికి ఉపక్రమించారు. దానికి డిజిటల్ లాక్ ఉండడంతో ఎలక్ట్రానిక్ కట్టర్‌తో తెరవచూశారు. అదే సమయంలో షేక్ నిశ్శబ్దంగా లేచి నిలుచున్నాడు. తలగడ కిందనుంచి రివాల్వర్ తీసుకుని సేఫ్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ‘భాయ్’ తలకు గురిపెట్టి ‘హ్యాండ్సప్ భానోజీ!’అన్నాడు. అదిరిపడ్డారు వాళ్ళు. రెండవ వ్యక్తి చేయి జేబులోకి వెళ్ళబోతే, ‘డోంట్ మూవ్, మ్యాన్!’ అంటూ షేక్ వెనుకే వచ్చిన పారెల్ పిస్టల్ని గురిపెట్టింది. ∙∙ ఈ సీక్రెట్ మిషన్‌లో ప్రభుత్వం చెన్నైకి చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ ప్రాణ్ సహాయాన్ని కోరింది. అతను తన అసిస్టెంట్ మిస్ గీతతో కలసి నేపాల్ వెళ్ళి మూడు నెలలపాటు అక్కడే మకాం వేసి భానోజీ కోసం గాలించాడు. అతని జాడ తెలియగానే, అతన్ని ట్రాప్ చేసేందుకు తగిన స్కెచ్ వేశాడు. తాను అరబ్ షేక్గానూ, గీత పారెల్గాను మారి వజ్రం పేరిట వలపన్ని భానోజీని హోటల్‌కి రప్పించడం, బంధించడం చేశారు. ఇటు భారత పోలీసులు, అటు నేపాల్ పోలీసుల ప్రమేయం లేకపోవడంతో ఆపరేషన్ అత్యంత గోప్యంగా, విజయవంతంగా జరిగిపోయింది. (యధార్థ సంఘటనల ఆధారంగా మలచిన ఈ కథ వాస్తవంలో ‘మాఫియా డాన్’ అసలు పేరు మాధవ్ సింగ్. కాంట్రాక్టర్లకు అతను ‘డబుల్ జీరో’ గానే తెలుసు. బిహార్, నేపాల్ సరిహద్దులోని సీతామర్హి జిల్లాలోని బరారీ సొంతూరు. తొలుత మాఫియా డాన్ బీరేందర్ కింద పనిచేసి ఆ తరువాత తన స్వంత ‘సామ్రాజ్యాన్ని’ ఏర్పరచుకున్నాడు. ఈనాటి వరకు డబుల్ జీరోని పోలీసులు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. చదవండి: బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా? -
నేనో డాన్.. నన్ను చూసి బెదరాలి
పహాడీషరీఫ్: తానో డాన్‌నని, తన పేరు చెబితే అందరూ బెదిరిపోవాలని సామాన్యులపై దాడులకు తెగబడుతున్న ఓ రౌడీషీటర్‌ను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ ఠాణాలో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, ఇన్స్పెక్టర్ వి.సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. షాహిన్నగర్కు చెందిన ముబారక్ బిన్ అబ్దుల్లా బిన్ సాల్మిన్ సిగర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచే తననొక డాన్‌గా ప్రకటించుకుని అందరూ తనను చూస్తే భయపడాలని భావించేవాడు. ఇందులో భాగంగా కత్తితో తిరుగుతూ పహాడీషరీఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట, చాంద్రాగుట్ట ప్రాంతాల్లో సామాన్యులపై దాడి చేసేవాడు. ఇతనిపై ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య, హత్యాయత్నం, దాడులు, దోపిడీ కేసులు ఉన్నాయి. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచారు. ఓ హత్యాయత్నం కేసులో 2018 మే నెలలో పహాడీషరీఫ్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బయటికి వచ్చిన ముబారక్ తన వైఖరి మార్చుకోకపోగా నాలుగు నెలల్లోనే ఇద్దరిపై దాడి, ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మారణాయుధంతో తిరుగుతున్న అతడిని బాలాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అదనపు ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ, ఎస్సైలు జి.మధు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డాన్‌ను అదేదో బ్రాండ్ అనుకున్నారు
ఇప్పటి కమర్షియల్ సినిమాల్లో డాన్ పాత్ర చాలా రెగ్యులర్ అయిపోయింది. డాన్ అంటే ఓ పవర్ఫుల్ విలన్. కానీ 41 ఏళ్ల క్రితం పరిస్థితి ఇది కాదు అంటున్నారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘డాన్’ ఒకటి. ఆ సినిమా విడుదలై 41 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ టైటిల్ ఫ్లాష్‌బ్యాక్ గురించి అమితాబ్ పంచుకుంటూ– ‘‘ఇండస్ట్రీలో చాలామంది డాన్ టైటిల్‌పై ఆసక్తి చూఫలేదు. డాన్ అంటే అర్థం కూడా చాలామందికి తెలియదు. హిందీ సినిమా టైటిల్‌లానే లేదన్నారు. ఈ టైటిల్ పలకడంలో ఓ పాపులర్ లో దుస్తుల కంపెనీ పేరుకు దగ్గరగా ఉందని, చాలా మంది ఇదేం టైటిల్ అని విచిత్రంగా చూశారు. ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజైన తర్వాత ‘డాన్’ అనే పేరు కొంచెం గౌరవప్రదంగా మారిందని, దాని ముందు వరకూ కామెడీగానే ఉంది’’ అన్నారు. సలీమ్– జావేద్ రచించిన ఈ చిత్రాన్ని ఎన్టీరా మారావు, రజనీకాంత్, షారుక్, అజిత్, ప్రభాస్... తర్వాత కాలంలో తమ భాషల్లో రీమేక్ చేశారు. -
డాన్ కావాలనే హత్య?
కర్నూలు, పాణ్యం: డాన్ కావాలనుకున్న ఓ విద్యార్థి తోటి స్నేహితుడినే మట్టుబెట్టాడు! అది కూడా సినిమా దృశ్యాలను తలపించే రీతిలో అతి కిరాతకంగా హత్య చేశాడు! ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ ఇదే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన ఖలీల్, సమీర కుమారుడు సద్దాంహుసేన్. ఇతను స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈ ఏడాది జూలై 17న అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సద్దాం హుస్సేన్‌ను తోటి స్నేహితులే చంపి, పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టిన అనంతరం అస్థికలను పాణ్యం మండలం పిన్నాపురం గ్రామం వద్ద పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో మంగళవారం నంద్యాల టూటౌన్ సీఐ సుబ్బరాయుడు, పాణ్యం సీఐ వాసుక్రిష్ణ, పోలీస్ కంట్రోల్ సీఐ విజయభాస్కరరెడ్డి, ఎస్ఐలు జగదీశ్వరరెడ్డి, కృష్ణుడు, ఆర్ఐ శ్రీనివాసులు, ఈఓ సుదర్శన్‌రావు, వైద్యులు గంగధర్‌నాయక్‌తో పాటు రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమక్షంలో సద్దాం అస్థికలు వెలికి తీయించారు. హత్య జరిగిన ప్రాంతంలో పడివున్న చెప్పులు, చొక్కా, రింగ్‌ను మృతుడి తండ్రి ఖలీల్, బంధువులు గుర్తించి శోకసంద్రంలో మునిగిపోయారు. అస్థికలను డీఎన్ఏ పరీక్షకు పంపనున్నామని, ఆ తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఇదిలావుండగా.. సద్దాం స్నేహితుల్లో ఒకడైన కేరళకు చెందిన విద్యార్థి డాన్ కావాలనే ఉద్దేశంతో అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివాసముంటూ చదువుకునేందుకు నంద్యాల వచ్చాడని, డాన్ కావాలనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ వేసి సద్దాంను అతి కిరాతంగా హత్య చేశాడని పోలీసు అదుపులో ఉన్న నిందితుల్లో ఒకరు చెప్పినట్లు సమాచారం. చెట్టుకు కట్టేసి, తలపై ఇనుప రాడ్‌తో మోది, ఆపై కత్తితో పొడిచి సినిమా దృశ్యాలను తలపించే రీతితో హతమార్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. కాగా.. సద్దాం తండ్రి ఖలీల్ మాత్రం మరో కథనం చెబుతున్నాడు. తన కుమారుడికి రూ.4 వేల స్కాలర్షిప్ వచ్చిందని, తమకు తెలియకుండా స్నేహితులకు ఇచ్చాడని, తిరిగివ్వాలని వారిని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ క్రమంలోనే గత నెల 17న స్నేహితుల్లో ఒకడైన వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు వచ్చి తమ కుమారుడిని తీసుకెళ్లాడని, ఇంతటి ఘోరానికి పాల్పడతారని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటన విషయంలో అమ్మాయి కోణంపైనా చర్చ సాగింది. -
లోకం చుట్టిన వీరుడు వీడు
న్యూయార్క్ : ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక ఎవరికైనా ఉండవచ్చు. అయితే అది తీర్చుకోవడం అందరివల్లే కాదు, కొందరి వల్ల కూడా కాకపోవచ్చు. పుష్కలంగా డబ్బులున్న వారే ప్రపంచాన్ని తిరిగి రాలేదు. అంతంత మాత్రంగా డబ్బులున్నా, ప్రపంచ దేశాలను చుట్టి రావాలన్న కోరిక బలంగా ఉండడంతో 73 ఏళ్ల మన డాన్ పారిష్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని తన కోరికను తీర్చుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వమున్న 193 దేశాల్లో పర్యటించి, 852 ప్రాంతాలను చుట్టిన మొట్టమొదటి ప్రపంచ యాత్రికుడిగా రికార్డు సష్టించారు. అమెరికాలోని షికాగో రాష్ట్రానికి చెందిన డాన్ పారిష్ ఉద్యోగార్థుడైన 1965లో అనుకోకుండా జర్మనీ వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారు. అక్కడ సెలవుల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటే కలిగిన తియ్యటి అనుభూతి ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరికకు బీజం వేసింది. ముందుగా మాతృ దేశమైన అమెరికా చుట్టి రావాలనుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలను చుట్టి రావాలనుకున్నారు. అందుకోసం బోలెడు డబ్బు అవుతుందని తెలుసు. అందుకోసం రేయింబవళ్లు టెలికమ్యూనికేషన్ల విభాగంలో కష్టపడి పనిచేశారు. వృధా ఖర్చులు మానుకున్నారు. అవసరమైనంత డబ్బు సమకూరిందనుకున్నాక 1965లో ఒంటరిగా ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. ముందుగా అమెరికాలోకి 50 రాష్ట్రాలను తిరిగారు. ఆ తర్వాత ఖండాలు, దేశాలు, దీవులు తిరిగారు. ఎక్కడికెళ్లినా ఖర్చు తక్కువగా ఉండే రవాణా వ్యవస్థను ఆశ్రయించేవారు. సొంతంగా ఓ పడవ కొనుక్కొని ఆ పడవపై 60 దేశాలు తిరిగారు. ఈ సందర్భంగా అనేక దీవులను సందర్శించారు. వాటిలో బౌంటీ ఐలాండ్స్, స్కాటీ ఐలాండ్స్, పారాసెల్ ఐలాండ్స్ ప్రముఖ దీవులు కూడా ఎన్నో ఉన్నాయి. జర్మనీ నుంచే ప్రారంభమైన ఆయన ప్రపంచ యాత్ర ఫిజీలోకి కాంకాయ్ రీఫ్ వద్ద ప్రస్తుతం ముగిసింది. అమెరికాకు ప్రత్యర్థి దేశమైన ఉత్తర కొరియా వెళ్లినప్పుడు ఆయన యాత్ర గురించి అక్కడి పత్రికలు మొదటి పేజీలో వార్తలు రాశాయి. డాన్ పారిష్ ఎక్కువ కాలం ఉత్తర కొరియాలో ఉన్న అమెరికన్‌గా రికార్డు నెలకొల్పడమే అందుకు కారణం. ఆయన దాదాపు మూడేళ్లపాటు అక్కడే నివసించారు. డబ్బులు అవసరం అయినప్పుడల్లా ఆ సమయంలో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో దొరికి ఉద్యోగం చేసేవారు. తన యాత్ర ఇంకా ముగియలేదని, మళ్లీ మొదలుపెట్టి మరిన్ని దేశాలు తిరిగి వస్తానని చెప్పారు. తమ పర్యటనలో తమకు నచ్చిన దేశం ఏమిటని ప్రశ్నిస్తే మాతృ దేశంకన్నా మంచి దేశం ఏముంటుందని అన్నారు. జర్మనీలో తాను వివిధ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక దేశాలు తిరిగాలన్న కోరిక పుట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ కెనడా దేశస్థుడు మైక్ స్పెన్సర్ 23 ఏళ్ల పాటు 195 దేశాలు తిరిగిన రికార్డు, ఆయన అనుభవాల గురించి తెలుసుకోవడం తనకు ఎక్కువ స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఆయనకంటే డాన్ పారిష్ రెండు దేశాలు తక్కువ తిరిగినప్పటికీ ఎక్కువ ప్రదేశాలను సందర్శించారు. -
ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండవు : ట్రంప్
అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాలన్నింటిన్నీ వదిలివేస్తానని సంచలన నిర్ణయం ప్రకటించిన అనంతరం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో తాను వైట్‌హోస్‌లో ఉన్నంత వరకు తన వ్యాపారాలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవని ప్రకటించారు. అయితే వటవృక్షంలో విస్తరించి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్‌లను ఎలా నిర్వహించబోతున్నారో అనే దానికి మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేసిన అనంతరం సోమవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. వాయిదా వేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వివాదాలు తనకు చుట్టుముట్టుకోకుండా ఉండేందుకు తీసుకోబోయే ప్లాన్స్‌ను వివరిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆ కాన్ఫరెన్స్‌ను ట్రంప్ వాయిదావేశారు. సమాచార ప్రసార సాధనంగా ఆయన ఎక్కువగా వాడే ట్విట్టర్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. తను అధ్యక్ష పదవి చేపట్టే ముందు వ్యాపారాలన్నింటిన్నీ తన కొడుకులు డాన్, ఎరిక్‌లకు అప్పజెప్పుతానని ప్రకటించారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలను నడిపిస్తారని ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ తన వైట్‌హోస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి కొత్త డీల్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడిగా ఉన్నంతమాత్రానా వ్యాపారాలు చేయకూడదని ఎలాంటి చట్టాలు లేకపోయినా.. తాను మాత్రం పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఉండటానికే కృషిచేస్తానని వాగ్దానం చేశారు. బ్యాంకు రుణాలు, లీజులు వంటి డీల్స్ అవసరమయ్యే తన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆయన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. సీఎన్ఎన్ అనాలిసిస్ ప్రకారం ట్రంప్ మొత్తం 500 కంపెనీలను కలిగి ఉన్నారు. వాటిలో 150 కంపెనీలు టర్కీ, ఖత్తర్, సౌదీ అరేబియా వంటి కనీసం 25 విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. -
డాన్ 'ఆట' క్లోజ్
– పేకాటలో పట్టుబడిన మట్కా డాన్ అసదుల్లా – ఆయనతోపాటు మరో 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు – 2.30 లక్షల రూపాయలతోపాటు 13 సెల్ఫోన్ల స్వాధీనం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలో మట్కాను నిర్వహిస్తూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మట్కా డాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం నగరంలో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. వారిలో మట్కా డాన్ అసదుల్లాతో పాటు పేకాట డాన్ సయ్యద్ అహ్మద్ కూడా ఉన్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, రూరల్ సీఐ నాగరాజు యాదవ్, వన్‌టౌన్ సీఐ కృష్ణయ్య తెలిపారు. వీరి నుంచి 2.30 లక్షల రూపాయలతోపాటు 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం త్రీటౌన్ పోలీసు స్టేషన్లో సీఐలు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ముందస్తు సమాచారం మేరకు బుధవారపేటలోని మాంటిస్సోరి స్కూల్ పక్కన ఉన్న గోడౌన్‌పై దాడి చేసి పట్టున్నట్లు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో కడక్పురాకు చెందిన షేక్ బాబు, చిత్తారివీధికి చెందిన సయ్యద్ అహ్మద్, షేక్ అక్బర్ బాఫా, బేకారికట్టకు చెందిన షఫీక్ అహ్మద్, బుధవారపేటకు చెందిన మట్కా డాన్ అసదుల్లా, జానీ, శాంతినగర్‌కు చెందిన గొల్ల లక్ష్మీనారాయణ, నందవరానికి చెందిన గోపిరెడ్డి పెద్దిరెడ్డి, బుధవారపేటకు చెందిన కటికె లతీఫ్, రోజావీధికి చెందిన మెడ్డీ అజంతుల్లా, కృష్ణానగర్‌కు చెందిన చింతా సిరా, సీక్యాంపునకు చెందిన షేక్ నజీర్, రాయచూరుకు చెందిన లవ్‌కుమార్ ఉన్నారు. డాన్ల చాప్టర్ క్లోజ్.. నగరంలో పేకాట, మట్కాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ పోలీసులకు దొరకకుండా అధికార పార్టీ నేతల అండతో సయ్యద్ అహ్మద్, అసదుల్లా తప్పించుకు తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ మట్కా, పేకాట డాన్లుగా చలామణి అవుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఒకరికొకరు డాన్ నేను అంటే నేను అని సవాల్ విసుకున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ‘డాన్ నువ్వా నేనా’ అన్న శీర్షికన నవంబర్ 11వ తేదీన ‘సాక్షి’లో కథనం కూడా ప్రచురితం అయింది. అయితే వీరిద్దరూ కలసి శుక్రవారం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో వారి డాన్ కార్యకలాపాలకు పుల్‌స్టాప్ పడినట్లేనని భావించవచ్చు. పోలీసులు వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
డాన్
నువ్వా..నేనా! వార్ మొదలైంది – వ్యాపార లావాదేవీల్లో విభేదాలు – వారం రోజుల క్రితం పరస్పర దాడులు – ఒకరినొకరు చంపుకునే స్థాయిలో గొడవలుఽఽ – పోటాపోటీగా కర్నూలులో మట్కా, పేకాట విస్తరణ – బుధవారపేట డాన్‌కు అధికార పార్టీ నేత అండదండలు – అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు - కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఎస్ఐ కుమారుడు కర్నూలు: మట్కా డాన్ల మధ్య మళ్లీ వార్ మొదలయింది. లావాదేవీల్లో విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు ఏకంగా వారం రోజుల క్రితం దాడులు కూడా చేసుకున్నారు. ఇద్దరి మధ్య పోటీలో ఒక ఎస్ఐ కుమారుడిపై చెప్పుల దాడి జరిగింది. గతంలో కుదిర్చిన రాజీ కాస్తా తాజా ఘటనతో బెడిసికొట్టింది. గత వారం రోజులుగా ఎవరికి వారుగా లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు. అయితే, అటు పాత బస్తీ డాన్, ఇటు బుధవారపేట డాన్ల మధ్య నెలకొన్న ఈ తాజా వైరం ఒకరినొకరు అంతమొందించుకునే దాకా వెళుతోందనే ఆందోళన వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది. ఇదీ గొడవకు కారణం వాస్తవానికి ఒకప్పుడు ఈ ఇద్దరు డాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాతబస్తీ బ్రదర్స్, బుధవారపేట మట్కా డాన్ల మధ్య రాజీ కుదిరింది. ఇంకేముంది.. మట్కాతో పాటు పేకాట కూడా ప్రారంభించారు. వ్యాపారంలో మరొకరిని పోటీకి రాకుండా మూడేళ్లుగా లక్షల్లో ఆర్జించారు. లావాదేవీల్లో విభేదాలు తలెత్తి వారం రోజుల క్రితం ఇరువర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్న నగరంలోని ఓ ఎస్ఐ కుమారుడిని బుధవారపేట డాన్ అనుచరులు చెప్పుతో కొట్టి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. పేకాట వద్ద గొడవ జరగ్గా నాగన్న అనే వ్యక్తి తాను బుధవారపేటకు చెందిన డాన్ అనుచరుడినంటూ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారని సమాచారం. అయితే, పాతబస్తీ బ్రదర్స్ నాగన్నను బయటకు తోసేశారు. ఈ నేపథ్యంలో బుధవారపేట డాన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు 20 మంది పెద్దపార్కుకు ఎదురుగా ఉన్న ఒక దుకాణంలోకి వెళ్లి పాతబస్తీ బ్రదర్స్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఎవరికి వారుగా గత వారం రోజుల నుంచి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మట్కాతో పాటు పేకాటకూ సై గతంలో కేవలం మట్కానే నిర్వహించే ఇరువురు డాన్లు తాజాగా పేకాట కేంద్రాలను కూడా విస్తరించారు. బుధవారపేట డాన్ తన ఇంటితో పాటు సమీపంలోని గోడౌన్, పాతబస్తీకి వెళ్లే రహదారిలోని మసీదు సందులో ఉన్న ఓ ఇంట్లో పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందుకు పోలీసుల సహకారం మెండుగా ఉంది. రోజు మార్చి రోజు స్థావరాలు మారుస్తూ పేకాట సాగుతోంది. అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు పోలీసులకు భారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే కేంద్రాన్ని మార్చాలంటూ పోలీసుల నుంచి హెచ్చరికలు వెళ్లగానే అటునుంచి జూదర్లు మాయమవుతుంటారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల, రాయచూరు, కడప, కర్నూలుతో పాటు గుంతకల్లు, అనంతపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతుంటారు. గతంలో డీజీపీకి ఫిర్యాదు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హయాంలో కూడా పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నట్లు బాధితుడొకరు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు దాడి చేసి మట్కా డాన్‌తో పాటు అనుచరులందరినీ అరెస్టు చేసి కటకటాలకు పంపారు. దాదాపు కోటిన్నరకు పైగా డబ్బును పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకోవడం ఇప్పటికీ పోలీసు శాఖలో చర్చనీయాంశం. కొంతకాలం పేకాట కేంద్రాలను మూసివేసి తర్వాత ఇరువురూ రాజీ పడి మళ్లీ పేకాట కేంద్రాలను కొనసాగించారు. డబ్బుల వసూళ్లలో తేడాలు రావడంతో ఒకరినొకరు విభేదించుకుని సొంతంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశముంది. కీలకంగా ఎస్ఐ కుమారుడు పాతబస్తీ బ్రదర్స్ తరపున రుక్మానందరెడ్డి, బుధవారపేట డాన్ తరపున సంపత్ అనే వ్యక్తులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. నగరంలోని ముఖ్యమైన స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఎస్ఐ కుమారుడు పేకాటరాయుళ్లకు అప్పులు ఇచ్చి భారీ మొత్తంలో వడ్డీతో పాటు ‘డిక్కీ' వసూలు వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఆయా స్థావరాల్లో పేకాట జోరుగా సాగుతోంది. పాతబస్తీ బ్రదర్స్ విడిపోయి ప్రస్తుతం గార్గేయపురం గ్రామ శివారులోని శివరాంపురం వద్ద పేకాట కేంద్రాన్ని నడుపుతున్నట్లు సమాచారం. -
డోన్ మండలంలో బాంబుల కలకలం
డోన్: కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత మహానందిరెడ్డి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మహానందిరెడ్డి గతంలో గ్రామంలో జరిగిన ఒక హత్య కేసు నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను హతమార్చేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు బాంబులతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
నేరాలకు ప్రేరణ.. ఈ సినిమాలే!
సినిమాకు చాలా సందర్భాల్లో నిజజీవితమే ప్రేరణ. వాస్తవ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చాలా సినిమాలు తెరమీదకొచ్చాయి. అయితే ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. నిజజీవితం ఆధారంగా వచ్చే సినిమాల కన్నా.. సినిమాల ఆధారంగా జరిగే నేరాల సంఖ్యే అధికంగా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో 15 ఏళ్ల అభయ్ మోధానిని అపహరించి.. అతని మరణానికి కారణమైన ఘటనకు కూడా ఓ సినిమా కథనే ప్రేరణ తీసుకున్నట్టు తేలింది. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రాన్ని ప్రేరేపణగా తీసుకొని ఈ కిడ్నాప్ దారుణానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో దారుణాలకు స్ఫూర్తిగా నిలిచిన టాలీవుడ్ సినిమాలు గురించి ఓ కథనం ఇది. డాన్! నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ముంబైలో ఓ దారుణానికి కారణమైంది. 2015 జూలైలో ముంబై నలాసోపారా ప్రాంతంలో 13 ఏళ్ల నిలేశ్ తివారీని అతని పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్లు హత్య చేశారు. నాగార్జున 'డాన్' హిందీ డబ్బింగ్ ను టీవీలో పలుసార్లు చూసిన ఆ ఇద్దరు అబ్బాయిలు తాము కూడా స్థానిక దాదాలు కావాలని కలలు కన్నారు. సినిమాలో మాదిరిగా దాదాగిరి చేస్తూ స్థానిక పిల్లల్ని వారు బెదిరించారు కూడా. ఈ సినిమాలో నాగార్జున మంచి డాన్ గా కనిపించినప్పటికీ, విలన్ పాత్ర పోషించిన కెల్సీ డోర్జీనే ఆ పిల్లల్ని ఎక్కువగా ఆకర్షించాడు. ఆఖరికీ వాళ్ల దాదాగిరి హత్యకు దారితీసింది. బిజినెస్ మ్యాన్! మహేశ్ బాబు విజయ్ సూర్యగా నటించిన ఈ సినిమాలో మంచి-చెడు రెండూ కలిసి ఉన్న బిజినెస్ మ్యాన్ గా కనిపించాడు. అయితే నేరస్తులకు ఈ సినిమాలోని చెడ్డ మహేశ్ బాబే ఎక్కువగా ప్రేరణ ఇచ్చాడు. 2012లో 2,11,256 మంది నేరస్తులను అరెస్టు చేయగా, అందులో 85శాతం మంది యువతే ఉన్నారని, ఈజీ మనీతో లావిష్ లైఫ్ గడుపాలన్న ఆలోచనే వారితో నేరాలు చేయించిందని జాతీయ నేర నమోదుబ్యూరో వెల్లడించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదలైన తర్వాత నేరాల రేటు పెరిగిందని, ఈ సినిమా స్ఫూర్తితో నేరాలు పెరిగిపోయాయని స్వయంగా ఓ పోలీసు అధికారే అప్పట్లో పేర్కొన్నారు. బాడీగార్డ్ ఈ సినిమా కొచ్చి బ్లాక్ మెయిల్ కేసుకు ప్రేరణగా నిలిచింది. రుక్సానా, బిందియా అనే మహిళలు ఓ ఎన్నారై వ్యాపారవేత్తకు వలపుల గాలం వేశారు. బాడీగార్డ్ సినిమాలో 'వాయిస్ చేంజింగ్' సాఫ్ట్ వేర్ తో వెంకటేశ్ ను బురిడీ కొట్టిస్తుంది. అదే తరహాలో ఈ ఇద్దరు మహిళలు ఓ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేశారు. వెంకటేశ్ మరో సినిమా 'దృశ్యం' తరహాలో తమ సెల్ ఫోన్ ను కర్ణాటక ఆర్టీసీ బస్సులో వదిలేసి.. తాము మాత్రం త్రివేండ్రం పరారయ్యారు. చివరకు పోలీసులకు దొరికిపోవడంతో అసలు గుట్టు రట్టయింది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ యువత చైన్ స్నాచింగ్ చేస్తూ.. కిడ్నాప్ లకు పాల్పడుతూ డబ్బు సంపాదించే కథనంతో రూపొందిన ఈ సినిమా చాలా నేరాలకే ప్రేరణగా నిలిచింది. తాజాగా హైదరాబాద్ వాసులను దిగ్భ్రాంత పరిచిన 15 ఏళ్ల అభయ్ మోధాని కిడ్నాప్, హత్య వ్యవహారానికి ఈ సినిమానే ప్రేరేపణ అయింది. ఒక రొమాంటిక్ ప్రేమ కథలోని ఓ సీన్ చూసి.. అభయ్ కిడ్నాప్ కు పథకం రచించామని, ఈ కిడ్నాప్ ద్వారా భారీగా డబ్బు రాబట్టాలని అనుకున్నామని 20, 23 ఏళ్ల మధ్య వయసున్న అందరూ నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిజానికి ఈ సినిమా విడుదల కాగానే ఒక్క వరంగల్ లోనే 26 చైన్ స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి. ఈ సినిమాలో మహిళలు ముఖానికి స్కాఫ్ కట్టుకొని.. ఆ ముసుగులో నేరాలకు పాల్పడినట్టు చూపారు. ఇదే తరహాలో ఇద్దరు బాలికలు ముఖానికి ముసుగు ధరించి ఓ దుకాణానికి వచ్చి.. కారం కొంటామంటూ ఆ కారాన్ని యజమాని కంట్లో కొట్టి రూ. 50వేలతో ఉడాయించారు. సింగం! అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన ఈ హిందీ సినిమా ముంబైలో ఓ కిడ్నాప్ కు ప్రేరేపణగా నిలిచింది. సినిమాలోని దృశ్యాల తరహాలోనే హరీశ్ మోహన్ పురోహిత్ అనే వ్యక్తి ఓ వ్యాపారవేత్త ఐదేళ్ల కొడుకును కిడ్నాప్ చేశాడు. ఆ పిల్లాడిని విడిచిపెట్టేందుకు రెండో వాయిదాగా రూ. 10 లక్షలు తీసుకుంటూ అడ్డంగా అతడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయాడు. ఇక మలయళంలో మొదట తెరకెక్కి ఆ తర్వాత ఇతర భాషల్లో రిమేక్ అయిన 'దృశ్యం' సినిమా కూడా పలు నేరాలకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యంగా సునీతా అహిరే అనే యువతిని ఆమె ప్రియుడు వికాస్ మహత్రే హత్య చేసి.. సినిమా తరహాలోనే దొంగ సాక్ష్యాలు అల్లేందుకు అతడు ప్రయత్నించాడు. -
‘తమ్ముడి’ పెత్తనం!
టీడీపీలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. ఒక్కరికి పదవి దక్కితే చాలు.. కుటుంబ సభ్యులంతా పెత్తనం చెలాయించొచ్చు. ఎలాంటి హోదా లేకపోయినా అధికారులను ముప్పుతిప్పలు పెట్టొచ్చు. తాజాగా ఓ ‘తమ్ముడు’ తన ఇల్లు కేంద్రంగా సమీక్ష నిర్వహించిన తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గురువారం డోన్ పట్టణంలోని తన ఇంట్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. డోన్ మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, చైర్పర్సన్ గాయత్రిదేవి, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మల్లిఖార్జున, హౌసింగ్ డీఈ రాధాకృష్ణమూర్తి, ఎంపీడీఓ క్యాథరిన్, వ్యవసాయశాఖ ఏడీ నర్సిరెడ్డి, ఏఓ బాలవర్దిరాజు హాజరయ్యారు. కార్యకర్తలు ఆ పనీ.. ఈ పనీ నేతకు చెప్పడం, ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చూస్తే ఏ స్థాయిలో ఆయన పెత్తనం చెలాయిస్తున్నారో అర్థమవుతోంది. పది రోజుల క్రితం సబ్ డివిజన్ స్థాయి అధికారులతో.. అంతకు ముందు తన అన్న ఏర్పాటు చేసిన జలవనరుల శాఖ సమీక్షలోనూ ఆయన హవా చాటుకున్నారు. ఆయనకు ఎలాంటి హోదా లేకపోయినా అధికారులు పదేపదే ఆ ఇంటి గడప తొక్కాల్సి వస్తుండటం గమనార్హం. ప్రజలు ఓట్లేసి పట్టం కట్టిన ఎమ్మెల్యేను కాదని.. ఆ నాయకుడు అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుండటం విమర్శల పాలవుతోంది. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
-
ఇంకా కథ దొరకలేదు, అయినా 'డాన్ 3' ఉంటుంది
బాద్షా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. షారూక్ ఖాన్ కెరీర్లో బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్‌లుగా నిలిచిన డాన్ సీరీస్‌లో మరో సీక్వల్ రూపొందనుంది.ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. ఇప్పటికే ఈ సీరీస్‌లో విడుదలైన రెండు భాగాలు, టాక్‌తో సంబందం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకే చాలా రోజులుగా ఈ సీరీస్‌లో మూడో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమితాబ్ హీరోగా తెరకెక్కిన 'డాన్' సినిమాను, షారూక్ ఖాన్ అదే పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత అదే క్యారెక్టర్‌తో తెరకెక్కిన 'డాన్' కూడా షారూక్‌ను కమర్షియల్ స్టార్‌గా నిలబెట్టింది. దీంతో మరోసారి డాన్ క్యారెక్టర్లో తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు బాద్షా. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు వినిపిస్తుండటంతో అన్నింటికి చెక్ పెట్టాడు దర్శకుడు పర్హాన్ అక్తర్.. 'ఇప్పటి వరకు డాన్ 3 కథ రెడీ కాలేదు.. కానీ తప్పకుండా డాన్ 3 సినిమా ఉంటుంది. అందులో షారూక్ డాన్‌గా నటిస్తాడు' అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం షారూక్ హీరోగా నటించిన దిల్వాలే రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఫ్యాన్, రాయిస్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల తరువాత డాన్ 3 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
పట్టుకోవడం కష్టం కాదు... అసాధ్యం!
అప్పారావు: దూరంగా ఉన్నవేవీ కనిపించడం లేదండీ.డాక్టర్ వెంగళ్: ఈ కిటికీలో నుంచి చూసి చెప్పు... ఆకాశంలో చందమామ కనిపిస్తుందా?అప్పారావు: బేషుగ్గా.డాక్టర్ వెంగళ్: అంత దూరాన ఉన్న చందమామనే చూడగలిగావ్. నీకెలాంటి సమస్యా లేదు వెళ్లు! బాక్సాఫీసు సూత్రాన్ని శాశ్వతంగా పట్టుకోవడం కష్టం కాదు... అసాధ్యం. డాన్ని కూడా అంతే. డాన్ కో పకడ్నా ముష్కిల్ నహీ... న ముమ్కిన్ హై! ‘షోలే’తో పుట్టారు సలీమ్-జావేద్ అనే బాలీవుడ్ పరుచూరి బ్రదర్స్. కానీ, 1978లో ‘డాన్’ క్యారెక్టర్ని హీరోగా చేసి రాసిన స్క్రిప్టుతో బాలీవుడ్లో ఏ దర్శకుడిని, నిర్మాతని, హీరోని ఒప్పించ లేకపోయారు. అందరి తిరస్కారానికీ గురైన ఆ స్క్రిప్టు ‘నారీమన్ ఎ. ఇరానీ’ అనే సినిమాటోగ్రాఫర్ కమ్ నిర్మాత జీవితాన్ని నిలబెట్టిందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇరానీ ఒక చిత్రం తీసి చేతులు, కాళ్లు, వళ్లు అన్నీ కాల్చుకుని కోటి ఇరవై లక్షల అప్పులో మునిగిపోతే, కెమెరామేన్‌గా వచ్చిన డబ్బులు బతకడానికీ, ఇంత పెద్ద అప్పు తీర్చడానికీ సరిపోక జీవితం దురవస్థల పాలైతే, ఆయన కెమెరామెన్‌గా మనోజ్ కుమార్ ప్రొడక్షన్లో ‘రోటీ కప్డా ఔర్ మకాన్’ అనే చిత్రానికి పనిచేస్తుంటే, దాని అసిస్టెంట్ డెరైక్టర్ చందర్ బారోత్ ఈయన దుస్థితిని చూడలేక, అమితాబ్‌ని, జీనత్ అమన్‌ని, నారీమన్గారు నిర్మాతగా ఒక్క చిత్రం చేసిపెడదాం అందరం కలిసి అని ఒప్పించారు. సలీమ్-జావెద్లని కలిస్తే ఎలాగా కంచి గరుడ సేవే కాబట్టి అప్పటికే కంచికి వెళ్లిపోయిందనుకున్న ‘డాన్’ కథని చవకగా ఇచ్చేశారు. మూడేళ్లు నానా కష్టాలూ పడి ఫైనాన్స్‌లు సమ కూర్చుకుని చందర్ బారోత్ దర్శకుడిగా చిత్రాన్ని పూర్తిచేస్తే, ఈలోపు నారీమన్ ఇరానీ చనిపోయారు. చిత్రం మీద వచ్చే డబ్బు ఆయన భార్యకి చెందేలా ఏర్పాటు చేసి మొత్తానికి చిత్రాన్ని రిలీజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ టాక్. అయినా ఓపిగ్గా థియేటర్ల వాళ్లు అలాగే ఉంచితే, ఆ నోటా ఈ నోటా ‘ఖైకే పాన్ బనారస్ వాలా..’, ‘అరె దీవానో...’, ‘యే మేరా దిల్...’ పాటలు బాగా పాపులర్ అయిపోయాయి. దాంతో జనం థియేటర్లకు పరుగు తీశారు. ఆ దెబ్బకి సినిమా రెండో వారం నుంచి పికప్ అయ్యి, చివరికి పెద్ద హిట్టయ్యి కూచుంది. సినిమాలో సెకండాఫ్ ట్విస్టులతో చాలా హెవీ అయిపోయింది కాబట్టి ప్రేక్షకుడికి రిలీఫ్ కోసం ఒక పాట పెట్టమని రషెస్ చూసిన మనోజ్‌కుమార్ సలహా ఇస్తే, అప్పుడు ఆలోచించి పెట్టిన పాటే ‘ఖైకే పాన్ బనారస్ వాలా’. చివరికి అదే ఈ చిత్రాన్ని పైలట్‌లా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. తర్వాత ఇదే డాన్ 2006లో ఓ కొత్త రికార్డు నెలకొల్పాడు. జావేద్ అక్తర్ కొడుకు ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ‘డాన్’ మరో సారి వచ్చింది. మళ్లీ సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. డాన్ని పట్టుకోవడం కష్టం కాదు అసాధ్యం అనుకుంటే కమర్షియల్ సినీ అభిమానులు ఆ డాన్ని అలవోకగా అభిమానంతో పట్టేశారు. గుండెల్లో దాచేశారు. ఇది చేసిన ఆర్టిస్టుల గొప్పదనం కాదు. తీసిన దర్శకుల గొప్పదనం కాదు. నిర్మాతల ఘనత అంతకన్నా కాదు. ఇది పూర్తిగా రచయితల విజయం. అన్నీ అమరి, అందరూ అప్పు తీర్చడానికి నడుం కట్టి సినిమా చేస్తే, ఆ సంకల్ప బలం నారీమన్ అప్పుల్ని తీర్చింది గానీ, వేరే సినిమా షూటింగ్లో కెమెరామెన్‌గా యాక్సిడెంట్‌కి గురైతే ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయింది. జీనత్ అమన్ మాత్రం చాలా జెన్యూన్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పారితోషికంగా. నిజమైన చారిటీ ఆమెదే. మొదటి డాన్ దర్శకుడు చందర్ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాలేవీ తీయలేదు. కానీ ‘డాన్’తో బాక్సాఫీస్‌ని అద్భుతంగా ప్రభావితం చేసి, ‘డాన్’ డెరైక్టర్‌గా మిగిలిపోయారు. ‘డాన్’ హీరోయిజమ్, విలనిజమ్ రెండు షేడ్సూ హీరోలకి మాస్ ఇమేజ్‌ని పెంచే క్యారెక్టర్లుగా మిగిలి పోయాయి. ఎనిమిదిన్నర కోట్ల బడ్జెట్‌తో తీస్తే డెబ్భై కోట్లు వసూలు చేసింది. ఇక షారుఖ్ ‘డాన్’ అరవై కోట్ల ఖర్చుతో తీస్తే నూట అయిదు కోట్లు వసూలు చేసింది. 78లోనే తెలుగులో ఎన్టీఆర్ ‘యుగంధర్’గా, తమిళంలో రజనీకాంత్ ‘డాన్’ పేరుతో ఈ హిందీ ‘డాన్’ని రీమేక్ చేసి హిట్టు కొట్టారు. మళ్లీ 2006లో షారుఖ్ ‘డాన్’ని తమిళంలో విష్ణువర్థన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘బిల్లా’ పేరుతో, తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టారు. షారుఖ్ పక్కన ప్రియాంకా చోప్రా అందాలు ఆరబోస్తే, అజిత్ పక్కన నయనతార, ప్రభాస్ పక్కన అనుష్క ఎప్పుడూ లేనంత గ్లామరస్‌గా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టారు. షారుఖ్ ‘డాన్’లో ఫర్హాన్ అక్తర్ టేకింగ్ స్టైల్ చాలా బావుంటుంది. అమితాబ్ లాంటి హీరో సినిమాని ఎవరు చేసినా సాధారణంగా చూడబుద్ధి కాదు. అలా చూసుకుంటే షారుఖ్ కొంత కొరతగా అనిపించవచ్చు గానీ, ఆ పోలిక లేకుంటే షారుఖ్ కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించినట్టే. కొత్త డాన్ హిట్ కావడానికి షారుఖ్ ఇమేజ్ బాగా పని చేసిందన్నది కాదనలేని వాస్తవం. పాటల్లో కూడా ‘ఖైకే పాన్ బనారస్ వాలా’, ‘యే మేరా దిల్’ని రీమిక్స్ చేసి మంచి పనిచేశారు దర్శకుడు ఫర్హాన్. హెలెన్ పోషించిన కామిని పాత్రని కరీనా కపూర్ పోషించడం సినిమాకి పెద్ద అట్రాక్షన్. అర్జున్ రామ్‌పాల్ పోషించిన జస్జీత్ పాత్ర చేయమని మొదట అక్షయ్ కుమార్‌ని అడిగితే, ‘డాన్’ పాత్ర అయితే చేస్తాను తప్ప వేరే పాత్ర చేయనన్నాట్ట. దాంతో అది అర్జున్‌కి దక్కింది. 78లో సలీమ్ - జావెద్ ఊహించిన ‘డాన్’ పాత్ర చిత్రణ, దాని నడవడిక, అందులో వచ్చిన ట్విస్ట్‌లు, పాత్రల స్వభావం కోసం వారు రాసిన మాస్, పంచ్ డైలాగులు... ఇవన్నీ 2006లో కూడా యథాతథంగా అంతే మోడరన్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయి. ప్రేక్షకులను అంతే ఆకట్టుకుఆన్నయి. అంటే ఒరిజినల్ ఆలోచన ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. మేధస్సంటే అదే. కాయితం మీద ఇలాంటి చిత్రాన్ని ఇంత బలంగా సృష్టించడం. దురదృష్టమంటే కూడా ఇదే. అంత పెద్ద రచయితలు కూడా ఇలాంటి స్క్రిప్టుతో ఎవరినీ ఒప్పించలేక పోవడం. అదృష్టమంటే ఆడియన్స్దే. ఏదో ఒకలా ఒక బలమైన సంకల్పం మూడున్నరేళ్లు కష్టపడి వెండితెరమీద బొమ్మైపడడం. అది మనసుల్ని రంజింపజేయడం. ఎంతమంది కథకులు నేర్చుకోవాల్సిన విషయాలున్నాయో ‘డాన్’ స్క్రిప్టులో అడుగడుగునా. ఈ ‘డాన్’ సక్సెస్ హాలీవుడ్లో ఒక చిత్రాన్ని ఇన్స్పైర్ చేసింది. కానీ అది ఆడలేదు. ఇదే సక్సెస్ రేఖ హీరోయిన్గా ‘మేడమ్ గీ’ పేరుతో ఇంకో చిత్రం రూపొందడానికి కూడా కారణమయ్యింది. అదీ ఆడలేదు. ఇలా ప్రభావితమై కొత్తగా రాసుకుని తీసిన చిత్రాలన్నీ ఫెయిలయ్యాయి. యథాతథంగా రీమేక్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అన్నాను ఇది రచయితల విజయం అని. ‘దేడ్ కహానీ’ అని దశాబ్దంన్నర కాలంలో బాలీవుడ్ సూపర్ హిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! 2000 నుంచి 2006 వరకూ నేను ప్రస్తావించిన ప్రతీ చిత్రమూ పాత కథే. అత్యంత పాత కథ షేక్స్పియర్ది (1595). అంటే ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్లో చిత్రాలుగా వచ్చిన కథలన్నీ మ్యాగ్జిమమ్ నాలుగు వేల సంవత్సరాల పాతవన్నమాట. కావాలంటే వెనక్కెళ్లి మళ్లీ అన్ని ఆర్టికల్సూ చూడండి... మీకే తెలుస్తుంది!