లోకం చుట్టిన వీరుడు వీడు | Don Parrish travelled 193 contries | Sakshi
Sakshi News home page

లోకం చుట్టిన వీరుడు వీడు

Published Mon, Nov 27 2017 5:34 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Don Parrish  travelled 193 contries - Sakshi - Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక ఎవరికైనా ఉండవచ్చు. అయితే అది తీర్చుకోవడం అందరివల్లే కాదు, కొందరి వల్ల కూడా కాకపోవచ్చు. పుష్కలంగా డబ్బులున్న వారే ప్రపంచాన్ని తిరిగి రాలేదు. అంతంత మాత్రంగా డబ్బులున్నా, ప్రపంచ దేశాలను చుట్టి రావాలన్న కోరిక బలంగా ఉండడంతో 73 ఏళ్ల మన డాన్‌ పారిష్‌ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని తన కోరికను తీర్చుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వమున్న 193 దేశాల్లో పర్యటించి, 852 ప్రాంతాలను చుట్టిన మొట్టమొదటి ప్రపంచ యాత్రికుడిగా రికార్డు సష్టించారు.

అమెరికాలోని షికాగో రాష్ట్రానికి చెందిన డాన్‌ పారిష్‌ ఉద్యోగార్థుడైన 1965లో అనుకోకుండా జర్మనీ వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారు. అక్కడ సెలవుల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటే కలిగిన తియ్యటి అనుభూతి ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరికకు బీజం వేసింది. ముందుగా మాతృ దేశమైన అమెరికా చుట్టి రావాలనుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలను చుట్టి రావాలనుకున్నారు. అందుకోసం బోలెడు డబ్బు అవుతుందని తెలుసు. అందుకోసం రేయింబవళ్లు టెలికమ్యూనికేషన్ల విభాగంలో కష్టపడి పనిచేశారు. వృధా ఖర్చులు మానుకున్నారు. అవసరమైనంత డబ్బు సమకూరిందనుకున్నాక 1965లో ఒంటరిగా ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు.

ముందుగా అమెరికాలోకి 50 రాష్ట్రాలను తిరిగారు. ఆ తర్వాత ఖండాలు, దేశాలు, దీవులు తిరిగారు. ఎక్కడికెళ్లినా ఖర్చు తక్కువగా ఉండే రవాణా వ్యవస్థను ఆశ్రయించేవారు. సొంతంగా ఓ పడవ కొనుక్కొని ఆ పడవపై 60 దేశాలు తిరిగారు. ఈ సందర్భంగా అనేక దీవులను సందర్శించారు. వాటిలో బౌంటీ ఐలాండ్స్, స్కాటీ ఐలాండ్స్, పారాసెల్‌ ఐలాండ్స్‌ ప్రముఖ దీవులు కూడా ఎన్నో ఉన్నాయి. జర్మనీ నుంచే ప్రారంభమైన ఆయన ప్రపంచ యాత్ర ఫిజీలోకి కాంకాయ్‌ రీఫ్‌ వద్ద ప్రస్తుతం ముగిసింది. అమెరికాకు ప్రత్యర్థి దేశమైన ఉత్తర కొరియా వెళ్లినప్పుడు ఆయన యాత్ర గురించి అక్కడి పత్రికలు మొదటి పేజీలో వార్తలు రాశాయి.  డాన్‌ పారిష్‌ ఎక్కువ కాలం ఉత్తర కొరియాలో ఉన్న అమెరికన్‌గా రికార్డు నెలకొల్పడమే అందుకు కారణం. ఆయన దాదాపు మూడేళ్లపాటు అక్కడే నివసించారు. డబ్బులు అవసరం అయినప్పుడల్లా ఆ సమయంలో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో దొరికి ఉద్యోగం చేసేవారు.

తన యాత్ర ఇంకా ముగియలేదని, మళ్లీ మొదలుపెట్టి మరిన్ని దేశాలు తిరిగి వస్తానని చెప్పారు. తమ పర్యటనలో తమకు నచ్చిన దేశం ఏమిటని ప్రశ్నిస్తే మాతృ దేశంకన్నా మంచి దేశం ఏముంటుందని అన్నారు. జర్మనీలో తాను వివిధ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక దేశాలు తిరిగాలన్న కోరిక పుట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ కెనడా దేశస్థుడు మైక్‌ స్పెన్సర్‌ 23 ఏళ్ల పాటు 195 దేశాలు తిరిగిన రికార్డు, ఆయన అనుభవాల గురించి తెలుసుకోవడం తనకు ఎక్కువ స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఆయనకంటే డాన్‌ పారిష్‌ రెండు దేశాలు తక్కువ తిరిగినప్పటికీ ఎక్కువ ప్రదేశాలను సందర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement